Fahadh Faasil : ఫాహద్ ఫాసిల్ ఆరోగ్యంపై స్పందించిన నజ్రియా.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్..

Fahadh Faasil : ప్రముఖ మళయాల నటుడు ఫాహద్ ఫాసిల్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఇటీవల కొచ్చిలో ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఫాహద్

Fahadh Faasil : ఫాహద్ ఫాసిల్ ఆరోగ్యంపై స్పందించిన  నజ్రియా.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్..
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2021 | 11:04 AM

Fahadh Faasil : ప్రముఖ మళయాల నటుడు ఫాహద్ ఫాసిల్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఇటీవల కొచ్చిలో ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఫాహద్ భార్య నటి నజ్రియా అతడి ఆరోగ్యం గురించి అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరంలేదని పేర్కొంది. అంతేకాకుండా ఫాహద్ ఫాసిల్ బెడ్ పై పడుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఫాహద్ ముక్కుకు బలంగా గాయం అయినట్లు తెలుస్తోంది.

ఫహద్ కోలుకున్న వార్త విని పలువురు ప్రముఖులు సంతోషించారు. నటుడు దుల్కర్ సల్మాన్, నవీన్ నిజాం, సౌబిన్ షాహిర్, అన్నా బెన్ త్వరగా కోలుకోవాలని మెసేజ్ పంపుతూ ఆకాక్షించారు. అతను ప్రస్తుతం థాంకం, మలయన్కుంజు, దిలీష్ పోథన్ యొక్క జోజి వంటి ఐదు ప్రాజెక్టులలో కలిసి పని చేస్తున్నాడు. పట్టు, పాచువుమ్ అల్బుతా విలక్కం వంటి సినిమాల్లో కూడా చేస్తున్నాడు. ట్రాన్స్, సూపర్ డీలక్స్ సినిమాలో కనిపించి మెప్పించిన ఫాసిల్.. 2014లో నజ్రియాను పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ట్రాన్స్(Trance) అనే సైకలాజికల్ సినిమా ద్వారా ప్రతీ భాషకు పరిచయం అయిన ఫాహద్ ఫాసిల్ ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్‌‌పై నుంచి దూకే సన్నివేశం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. బ్యాలెన్స్‌ అదుపుతప్పి ఫాసిల్ బిల్డింగ్‌పై నుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఫాసిల్‌ను కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఫాసిల్ ముక్కుకు బలమైన గాయం తగలగా.. స్వల్ప గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు.

Jeff Bezos Ex Wife:మళ్లీ పెళ్లి చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను వివాహమాడిన మెకంజీ.. వివరాలు మీకోసం..