ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ ఇతడే.. తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదంటున్న పాకిస్తాన్ మాజీ సారథి..

Inzamam ul Haq Praises Pants Batting : నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి ఆట తీరును ఇండియన్ మాజీ

ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ ఇతడే..  తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదంటున్న పాకిస్తాన్ మాజీ సారథి..
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2021 | 12:28 PM

Inzamam ul Haq Praises Pants Batting : నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి ఆట తీరును ఇండియన్ మాజీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట తీరుతో పోల్చుతూ అభినందించాడు. ఇప్పటి వరకు తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదని కొనియాడాడు. ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ అంతటి బ్యాట్స్‌మెన్ ఇతడే అని పొగడుతున్నాడు. తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రిషభ్‌పంత్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని తన మనసులో మాటను వ్యక్తపరిచాడు. పంత్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉందని, చాలాకాలం తర్వాత ఒత్తిడి లేకుండా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌ను చూశానని చెప్పాడు. ‘146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలోనూ అతడిలా ఎవరూ ఆడలేరు. పిచ్‌ ఎలా ఉన్నా.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తన సహజసిద్ధమైన ఆటను ఆడగలడు. ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా చూస్తాడు.

అతడి ఆటను పూర్తిగా ఆస్వాదించాను. ఆ బ్యాటింగ్‌ చూస్తుంటే సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించింది. నేను సెహ్వాగ్‌తో ఆడాను. అతడు కూడా పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఆడతాడు. వీరూ బ్యాటింగ్‌ చేస్తుంటే పిచ్‌ ఎలా ఉంది. ప్రత్యర్థులు ఎవరనేవి లెక్కలోకి రావు. బంతిని దంచికొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. బౌండరీ వద్ద ఫీల్డర్లు ఉన్నా అలాగే ఆడతాడు. సెహ్వాగ్‌ తర్వాత అతడిలాంటి బ్యాట్స్‌మన్‌ను పంత్‌నే చూశాను’ అని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్‌(101) శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Karnataka Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.. Dharani website : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ పట్టా పాస్ బుక్‌లో తప్పులున్నాయా..? అయితే ఇలా సవరించుకోండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!