- Telugu News Photo Gallery Sports photos Ipl 2021 this rcb player might win orange cap in the tournament
ఐపీఎల్ 2021: స్టార్ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న ఆర్‌సీబీ ప్లేయర్.. ఈసారి ఆరెంజ్ క్యాప్ గ్యారెంటీ.!
IPL 2021: సిక్సర్ల హోరు.. ఫోర్ల జోరు.. ఐపీఎల్ వస్తే చాలు.. బ్యాట్స్‌మెన్ వీరబాదుడు తప్పదు.. మరి వారిలో ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 09, 2021 | 1:06 PM

డేవిడ్ వార్నర్ - ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ఫామ్ గురించి అతడి గణాంకాలు చెబుతాయి. గత సీజన్లలో అతడి ప్రదర్శనను ఒకసారి పరిశీలిస్తే.. ఖచ్చితంగా ఐపీఎల్ 2021లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే పోటీదారుల్లో ముందు వరుసలో ఉంటాడు. గతంలో వార్నర్ ఐపీఎల్ 2014, 2015, 2016, 2017, 2019, 2020లలో టాప్ రన్-స్కోరర్.

కెఎల్ రాహుల్ - రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్‌లో తన టీం పెర్ఫార్మన్స్ అద్భుతంగా లేనప్పటికీ.. ఒంటి చేత్తో కొన్ని విజయాలను అతనొక్కడే టీంకు అందించాడు. అలాగే టాప్ రన్ గెట్టర్‌గా నిలిచి ఐపీఎల్ 2020లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

రోహిత్ శర్మ - రోహిత్ శర్మ... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్, తన జట్టు ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు. రోహిత్ శర్మ ఓపెనర్ కావడంతో ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ ఈసారి తన మొదటి ఆరెంజ్ క్యాప్‌ను అందుకునే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ - ఆరెంజ్ క్యాప్ గురించి మాట్లాడినప్పుడు.. ముందుగా గుర్తొచ్చేది ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2015, 2017 మినహా మిగతా టోర్నమెంట్‌లలో టాప్ 10 రన్ స్కోరర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అదే క్రమంలోనే ఈసారి కూడా టాప్‌లో ఉండే అవకాశం లేకపోలేదు.

దేవ్‌దూత్ పడిక్కల్ - ఈ యువ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తరపున అరంగేట్రం చేశాడు. టోర్నమెంట్ అంతటా మంచి ప్రదర్శనను కనబరిచాడు. అంతేకాకుండా ఇటీవల జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే పడిక్కల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే పోటీదారుల్లో ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.




