- Telugu News Photo Gallery Sports photos Womens day 2021 special these are the top indian women players in the india right now
Women’s day 2021 : క్రీడా రంగంలోనూ ‘ఆమే’ మహా రాణి.. అంతర్జాతీయ యవ్వనికపై భారత జెండాను రెపరెపలాడిస్తూ మహిళా రాణులు వీరే..
ప్రపంచవ్యాప్తంగా సోమవారం మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రీడా రంగంలోనూ భారత మువ్వన్నెల జెండాను ప్రపంచ యవ్వనికపై రెపరెపలాడిస్తూ మహిళాలోకంకు ధీటుగా రాణిస్తున్న మగువలు వీరే...
Updated on: Mar 08, 2021 | 11:35 PM

బాక్సింగ్ అంటే పురుషులకే సొంతం అనేది ఒకనాటి కథ.. ఇప్పుడు అన్నింటా మేమున్నామని మహిళా లోకం దూసుకొస్తోంది.బంగారు పతకాలతో భారతదేశ ప్రతిష్టను పెంచుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందు వరసలో మనకు కనిపించేది మేరీ కోమ్. ఈ మణిపూర్ మణిపూస 39వ పడిలోకి అడుగుపెట్టింది. మాగ్నిఫిసెంట్ మేరీ ఐదుసార్లు ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్, ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఒక్కో విభాగంలో పతకాలను సాధించింది.

టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్... ఉమెన్స్ క్రికెట్ లో ఎక్కువ సంవత్సరాలుగా ఆడుతున్న క్రీడాకారిణి. మెన్స్ క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎలాగో..మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ అంతే... వన్డేల్లో 6000 పరుగులు మార్కును అధిగమించిన ఏకైక మహిళ క్రికెటర్.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది. 16 ఏళ్ళ వయసులోనే టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు సానియా మీర్జా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.


పీవీ సింధు అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.

రెజ్లింగ్ స్టార్ గీతా ఫోగాట్ కామన్వెల్త్ గేమ్స్ లో కుస్తీలో గోల్డ్ దక్కించుకున్న తరువాత ఆమె ఇంటి పేరుగా మారింది. సమ్మర్ ఒలింపిక్స్ (2012) కు అర్హత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్.
