- Telugu News Photo Gallery Sports photos Happy birthday harmanpreet kaur special tribute to team india womens t20 captain
Harmanpreet Kaur: వన్డే చరిత్రలో అదో అద్భుతం.. సిక్సర్ల వర్షం.. ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్..!
టీమిండియా విమెన్స్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ ఖాతాలో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె 171 పరుగుల గురించి....
Updated on: Mar 08, 2021 | 4:33 PM

హర్మన్‌ప్రీత్ కౌర్ 2017 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ఆమె కెరీర్‌తో పాటు యావత్తు మహిళల క్రికెట్‌కు చిరస్మరణీయమని చెప్పవచ్చు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులు మాత్రమే చేసింది. అప్పుడు గ్రౌండ్‌లోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.

భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు చేసిన రికార్డును హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఖాతాలో వేసుకుంది.

హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్‌తో 42 ఓవర్లకు భారత్ 4 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 245 పరుగులకే ఆలౌట్ అయింది.




