AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము ఒక వ్యక్తిని ఎంత వేగంగా వెంబడించగలదో తెలుసా..? దాని స్పీడ్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

భారతదేశంలో వేలాది జాతుల పాములు కనిపిస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. వీటిలో నాగుపాము ఒకటి. అన్ని పాములలో నాగుపాము అత్యంత చురుకైనది. ఈ పాము వేగం సెకనుకు 3.3 మీటర్లు. ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రెప్ప పాటు సమయంలో వెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంది.. ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని చూడండి..

పాము ఒక వ్యక్తిని ఎంత వేగంగా వెంబడించగలదో తెలుసా..? దాని స్పీడ్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Snake
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2025 | 9:57 PM

Share

పాముల గురించి ఉన్న అతి పెద్ద అపోహ ఏమిటంటే అవి ప్రతీకారంతో ప్రజలను వెంటాడుతాయని. కానీ నిజం ఏమిటంటే పాములు ఎప్పుడూ మనుషులను వెంబడించవు. పగబట్టవు అంటున్నారు విశ్లేషకులు. అవి ఎప్పుడూ మనుషులకు దూరంగా ఉండాలని కోరుకుంటాయి. కానీ, అవి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే దూకుడుగా మారతాయి. కానీ ఆ సమయంలో అవి మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు భయంతో పారిపోతుంటారు. పాము ఎప్పుడూ మీపై ఆ కారణంగా దాడి చేయదని చెబుతున్నారు. అది రెండు సందర్భాల్లో మాత్రమే మీపై దాడి చేయడానికి ప్రయత్నించవచ్చు. ఒకటి.. అది మీ నుండి ప్రమాదాన్ని గ్రహిస్తే వెంటనే కాటు వేస్తుంది. మరొకటి..అది తన ఆహారంగా భావిస్తే కాటేస్తుంది.

నాగుపాము చాలా విషపూరితమైనది. అలాగే చురుకైనది కూడా. కాబట్టి, పొరపాటున ఎప్పుడైనా మీ పరిసరాల్లోకి పాములు వస్తే సరైన శిక్షణ లేకుండా పామును పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం తెలియజేయడం చాలా మంచిది.. అలాగే, వాటిని చంపడానికి కూడా వెళ్లకండి.. పాము చాలా వేగంగా దాడి చేస్తుంది. రోడ్డు ఎంత కఠినంగా ఉన్నా, రాతిగా ఉన్నా, దాని వేగం తగ్గదని గుర్తుంచుకోండి. నాగుపాములు ఇతర జాతుల పాముల కంటే వేగంగా ఉంటాయి. అంతేకాదు..ఈ పాములు నీటిలో కూడా వేగంగా ఈదుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి..

అవును.. నాగుపాము భూమి మీద ఎంత చురుగ్గా ఉంటుందో, నీటిలో కూడా అంతే చురుగ్గా ఉంటుంది. అందుకే, ఈ పాము నీటిలో ఏమీ చేయలేకపోతుందని భావించి ఎదైనా స్టంట్‌ చేయటానికి ట్రై చేస్తే చావు తప్పదని గుర్తుంచుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..