కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!
Actor Yash Family: కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Actor Yash Family: కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అసలు ఎందుకు వీరి మధ్య వివాదం తలెత్తింది.? దానికి గల కారణం ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. హాసన్ జిల్లాలోని తిమ్మెనహళ్లి గ్రామంలో యాక్టర్ యష్ 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఆ భూమి చుట్టూ కంచె వేయాలని యష్ తల్లిదండ్రులు అనుకోగా.. అలా జరిగితే తమ పొలాలకు దారి మూసుకుంటుందని గ్రామస్థులు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే యష్ తల్లి పుష్ప లతతో గొడవకు దిగారు.
ఈ వివాదం ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానగా మారింది. దీనితో గ్రామస్తులు గుద్ద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ 80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లే దారి మూసుకుపోతుందని.. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న తమ భూములకు దారి మూసేయడం తగదని గ్రామస్తులు పోలీసుల ముందు వాపోయారు. దీనితో పోలీసులు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!