- Telugu News Photo Gallery Spiritual photos Unknown facts of airavatesvara temple in kumbakonam distric
Airavatesvara Temple : సైన్స్ కు అందని అద్భుతం ఈ ఆలయం.. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి
తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐరావతేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ దేవాలయం కూడా చోళుళ నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది.
Updated on: Mar 09, 2021 | 5:33 PM

చోళరాజుల ప్రసిద్ధ నిర్మాణాల్లో ఒకటి శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దారాసురంలో ఉంది. ఇక్కడి శివుని పేరు'' ఐరావతేశ్వరుడు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో ఒకటి.

ఇంద్రుని వాహనమైన ఐరావతం (తెల్ల ఏనుగు), యముడు ఇక్కడ ఉన్న స్వామిని ఆరాధించినట్లు పురాణేతిహాల కథనం. శివుడిని ఏడు తొండాలు, నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుడి వాహనమైన ఐరావతం భక్తి శ్రద్దలతో పూజించినట్లు పురాణాల కథనం

యమ ధర్మ రాజుకి ఓ యోగి ఇచ్చిన శాపంతో శరీరం అంతా మంటపుడుతున్నట్లు ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న పవిత్ర కోనేరులో మునిగి శాపం విమోచనం పొందినట్లు భక్తుల నమ్మకం. అందుకనే ఇక్కడ ఉన్న పుష్కరిణికి యమతీర్ధం అనే పేరు వచ్చింది. .

ఐరావతం దుర్వాస మహాముని కోపానికి గురై శాపం తో తెలుపు రంగుని కోల్పోయింది. అప్పుడు ఈ ఆలయంలోని శివుడిని ఆరాధించి అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించగా పూర్వపు రంగైన తెలుపు రంగుని పొందినట్లు పురాణాల్లో ఉంది. అందుకనే అప్పటి నుంచి ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారని పెద్ద లింగ రూపంలో ఉన్న శివయ్య ఐరావతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారని స్థలం పురాణం

చాళుక్యులు శిల్పకళలను ప్రోత్సహించారు. ఈ ఆలయం లో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూడచక్కగా ఉంటాయి. రథం ఆకారంలో ఉన్న ఈ ఆలయానికి రాతి చక్రాలను చెక్కారు. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఇక ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో ఎంతో ఠీవి గా కనిపిస్తూ.. పర్యాటకులను భక్తులను ఆకర్షిస్తుంది.

ఈ ఐరావతేశ్వర ఆలయంలో సైన్ కు అందని అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వివిధ స్వరాలను పలికే శిల్పాలు దర్శించుకోవచ్చు. అంతేకాదు.. సంగీతాన్ని ప్రతిధ్వనించే రాతి మెట్లు కూడా ఉన్నాయి. ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..




