- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Thama to Ram Charan Game Changer latest movie updates from industry
Movie Updates: థామా సెట్లోకి నేషనల్ క్రష్.. గేమ్‌చేంజర్ గురించి సుకుమార్..
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక నటిస్తున్న సినిమా థామా షూటింగ్ అప్డేట్. గేమ్‌చేంజర్ క్లైమాక్స్ పై సుకుమార్ చేసిన కామెంట్స్. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడాలంటున్న తాప్సీ. రజనీకాంత్ జైలర్ సీక్వెల్ అప్డేట్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కిక్2 మూవీ షూటింగ్ అప్డేట్. ఇలాంటి కొన్ని సినిమా అప్డేట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Dec 27, 2024 | 12:12 PM

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక నటిస్తున్న సినిమా థామా. ఇటీవల సెట్లోకి అడుగుపెట్టారు రష్మిక మందన్న. ఆమెపై పరిచయ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఉత్కంఠభరితమైన ప్రేమకథగా రూపొందుతోంది థామా. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరిలో ఊటీలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుందీ మూవీ.

గేమ్‌చేంజర్ క్లైమాక్స్ లో రామ్‌చరణ్ నటన చూశాక, తప్పక అతనికి జాతీయ పురస్కారం వరిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం తర్వాత చరణ్‌తో తన అనుబంధం కొనసాగిందని చెప్పారు. చిరంజీవిగారితో కలిసి గేమ్ చేంజర్ చూశాను. శంకర్ టాప్ మూవీస్‌ని ఎంతగా ఆస్వాదించానో, ఈ మూవీ కూడా అంతే మెప్పించిందన్నారు సుకుమార్.

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ కీ రోల్‌లో నటిస్తున్న సినిమా గాంధారి. యాక్షన్ థ్రిల్లర్ ఇది. షూటింగ్ స్టార్ట్ అయిందన్నారు తాప్సీ. ''సమయం వచ్చినప్పుడు యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతూ మరణించాలిగానీ, శత్రువుల ముందు భయపడకూడదు. పోరాటం ప్రారంభిద్దాం'' అంటూ షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని చెప్పారు తాప్సీ.

రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. రజనీ తొలి భాగంలో కన్నా మరింత స్టైలిష్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం కూలీ పనులతో బిజీగా ఉన్నారు రజనీ. ఇది పూర్తి కాగానే కాస్త మేకోవర్ అయి జైలర్2 సెట్స్ కి హాజరవుతారు.

కిక్2 స్క్రిప్ట్ ముగింపు దశలో ఉందన్నారు సల్మాన్‌ఖాన్. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందా? అని అందరూ అడుగుతున్నారన్నారు. స్క్రిప్ట్ ముగింపు దశలో ఉందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.




