ఇన్‌స్టాగ్రామ్‌లో లీనమైపోతున్నారా..? వెంటనే ఈ సెట్టింగ్ చేయండి..!
TV9 Telugu
27 December
2024
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, పోస్ట్‌లను చూడటానికి గంటలు గడుపుతున్నారా? ఈ అలవాటును మెరుగుపరచడంలో ఒక ఉపాయం మీకు సహాయపడుతుంది..!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం వెచ్చించాలనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్వయంగా ఇస్తుంది.
టీనేజ్ ఖాతాలకు రోజువారీ సమయ పరిమితి ఒక గంట ఆటోమేటిక్‌గా ఉంటుంది. మీరు నిర్దేశించిన సమయ పరిమితిని దాటితే ఇన్‌స్టాగ్రామ్ అలర్ట్ చేస్తుంది.
పిల్లల విషయంలో, సమయ పరిమితి దాటితే తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేయవచ్చని సంస్థ తెలిపింది.
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయడానికి, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో స్క్రీన్ దిగువ కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కండి.
ఎగువ కుడి మూలలో 'మోర్ అప్సన్స్' నొక్కండి, ఆపై 'హౌ యూ యూజ్ ఇన్‌స్టాగ్రామ్' విభాగంలో 'యువర్ యాక్టివిటీ' ఎంపికను ఎంచుకోండి.
ఇప్పుడు మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ గురించి సమాచారాన్ని పొందే 'టైమ్ స్పెస్ట్' ఎంపికపై నొక్కండి.
'రోజువారీ పరిమితి'పై నొక్కడం ద్వారా మీ రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయండి. దాన్ని నిర్ధారించండి, మీరు మీ ఎంపిక ప్రకారం సమయ పరిమితిని సెట్ చేయవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సైకాలజీ నేర్చుకుంటున్నారా.? ఉత్తమ పుస్తకాలు ఇవే..
ఒరిస్సాకి ఆ పేరు ఎలా వచ్చింది.?
ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూడవచ్చా..?