- Telugu News Photo Gallery Telangana: Three colour flowers on a single hibiscus plant bhadrachalam district
Telangana: ఒకే మొక్కకు ఏకకాలంలో మూడు రకాల మందారం పువ్వులు.. చూపరులను ఆకర్షిస్తున్న పుష్పాలు..
ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరాల్లో ఒకటి పువ్వులు. పూజకు మాత్రమే కాదు ఔషధ గుణాలతో పాటు అందానికి కూడా ఉపయోగించే రకరకాలు పువ్వులున్నాయి. అలాంటి పువ్వుల్లో ఒకటి మందారం. ఇది అందమైన పువ్వు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మందారం పువ్వు లేని ఇల్లు కనిపించడం బహు అరుదు. అయితే ఆధునిక కాలంలో ఇరుకైన ఇంటిలో ఇప్పుడు మొక్కల పెంపకం బహు కష్టం. అయినా సరే వీలు దొరికిన వారు తప్పనిసరిగా మందారం మొక్కను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అది మందారం పువ్వులకు ఉన్న స్థానం. అయితే మందారం పువ్వుల్లో అనేక రకాలున్నాయి. అయితే ఒకే మొక్కకు మూడు రకాల మందారం పువ్వులు పూస్తూ చూపరులను ఆకర్షిస్తోంది.
N Narayana Rao | Edited By: Surya Kala
Updated on: Dec 27, 2024 | 12:36 PM

మందారం పువ్వు అంటే ముందుగా ఎరుపు రంగులో అందంగా కనిపించే పువ్వు గుర్తుకొస్తుంది. ప్రతి ఇంట్లో పెరట్లో, నర్సరీ ల్లో, పార్కు ల్లో కనిపిస్తాయి. మందారం రెడ్ కలర్ లో అందరినీ ఆకర్షిస్తుంది. ముద్ద మందారం అయినా .. ఐదు రేకలతో విచ్చుకున్న మందారం అయినా సరే మందారాలను ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో రకాలు మందార పువ్వులను చూస్తూనే ఉన్నాం.. కానీ ఒకే చెట్టుకు మూడు రకాల మందార పువ్వులు పుస్తున్నాయి. ఈ వింత సంఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది.

భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలోని తోటమల్ల నిరోష అనే గృహిణి పెంచుకుంటున్న మందారం చెట్టు 8 అడుగులకు ఎత్తు పెరిగింది..అటుగా వెళ్ళే వారు హైట్ చూసి ఆశ్చర్య పడుతున్నారు.

ఇదే మందారం చెట్టుకు మూడు రంగుల పువ్వులు పూస్తూ ఆకట్టు కుంటున్నాయి...ఆరు నెలల క్రితం నర్సరీ నుంచి ఈ మొక్కలు తీసుకు వచ్చి తన ఇంటి పెరట్లో పెంచుకుంటోంది..

ఒకే చెట్టుకు రెడ్, ఎల్లో, పింక్ రంగులతో మందార పువ్వులు పూస్తున్నాయి...ఒకే చెట్టుకు మూడు రంగుల పువ్వులు పుస్తుండడముతో స్థానికులు, మహిళలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ప్రతి రోజూ పూజించే తులసి చెట్టుతో పాటు ఇష్టంగా పెంచుకునే మందార చెట్టుకు కూడా నిత్యం రాగి బిందెతో నీళ్లు పోయడం వల్లనే ఇలా మూడు రంగుల పూలు పుస్తున్నా యనీ గృహిణి నిరోష అంటున్నారు.

మందార చెట్టుకు పూసిన పువ్వులు అందరిని ఆకర్షిస్తున్నాయి...ప్రతి రోజూ ఇంటిలో పూజకు ఈ పూవులు ఉపయోగిస్తున్నారు..స్థానికులు నుంచి వీటికి డిమాండ్ ఉంది..ఎంతైనా సుందర మందారం.. త్రీ కలర్స్ లో బ్యూటిపుల్ గా ఎట్రాక్ట్ చేస్తూ కట్టి పడేస్తున్నాయి





























