Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manmohan Singh: ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ను పివి నరసింహారావు ఎందుకు ఎంచుకున్నారు..?

డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న ప్రస్తుతం పాకిస్థాన్‌లో భాగమైన పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. అతని తండ్రి పేరు గురుముఖ్ సింగ్, తల్లి పేరు అమృత్ కౌర్. అతను 1958లో గురుశరణ్ కౌర్‌ని వివాహం చేసుకున్నారు. అతనికి ఉపిందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Manmohan Singh: ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ను పివి నరసింహారావు ఎందుకు ఎంచుకున్నారు..?
Pv Narasimha Rao, Manmohan Singh
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 27, 2024 | 1:34 PM

ఇది దాదాపు 1991 జూన్ నెల. యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ ఆఫీసులో ఫోన్ మోగింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు నరసింహారావు అని చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడాలని అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు స్వయంగా కాల్ చేశారు. కొద్ది నిమిషాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోన్‌ దగ్గరకి వచ్చారు. నరసింహారావు వెంటనే నిన్ను నా ఫైనాన్స్ మంత్రిగా చేయాలనుకుంటున్నాను.. నువ్వు సిద్ధపడి రాష్ట్రపతి భవన్‌కు రండి అని చెప్పారు.

పివి నరసింహారావు ఇచ్చిన ఈ పిలుపుతో డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆయన ఏకంగా ఆర్థిక మంత్రి అయ్యారు. అంతకుముందు, మన్మోహన్ సింగ్ 1972లో ఆర్థిక మంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ఆ తర్వాత 1980 నుంచి 1982 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా, 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. 1985 నుండి 1987 వరకు ప్రణాళికా సంఘం చైర్మన్. ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా కూడా ఉన్నారు.

1991 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఎన్నికల ఫలితాలు రాగానే కాంగ్రెస్ 244 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, అయితే సోనియా గాంధీ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాని కోసం అన్వేషణ మొదలైంది. ముందుగా శంకర్‌ దయాళ్ శర్మ పేరు వచ్చింది. సోనియా గాంధీ దూతలు శంకర్‌ దయాళ్ శర్మను ఒప్పించేందుకు ప్రయత్నించగా, ఆయన అంగీకరించలేదు.

ఈలోగా రాజకీయాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు చెందిన అపర రాజకీయ చాణక్యుడు పివి నరసింహారావు భవితవ్యం తేలిపోయింది. శంకర్‌ దయాళ్ శర్మ నిరాకరించడంతో పివి నరసింహారావు పేరును సోనియా గాంధీకి సూచించారు. ఆ తర్వాత నరసింహారావు పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రధానమంత్రి కాకముందు నరసింహారావు అనేక శాఖల మంత్రిగా పనిచేశారు. అతనికి చాలా అనుభవం ఉంది. కానీ అతను ఆర్థిక మంత్రిత్వ శాఖ గురించి చాలా ఆందోళన చెందారు. 1991లో భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తి కోసం పివి అన్వేషించారు.

అటువంటి పరిస్థితిలో, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలోకి తీసుకురాగల వ్యక్తికి ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించాలని నరసింహారావు కోరుకున్నారు. నరసింహారావు సలహాదారు పీసీ అలెగ్జాండర్ ఐజీ పటేల్ పేరును సూచించారు. IG పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కూడా ఉన్నారు. నరసింహారావు ప్రతిపాదనను ఐజీ పటేల్ అంగీకరించలేదు. ఎందుకంటే తన తల్లి అనారోగ్యం కారణంగా అతను ఢిల్లీకి రావడానికి ఇష్టపడలేదు. అప్పుడు అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్ పేరును సూచించారు.

మన్మోహన్ సింగ్‌ను పిలిచిన పిసి అలెగ్జాండర్ ఆర్థిక మంత్రిగా ప్రతిపాదించారు. మన్మోహన్ సింగ్ దానిని జోక్ అని కొట్టిపారేశారు. మరుసటి రోజు పివి నరసింహారావు స్వయంగా మన్మోహన్‌సింగ్‌కు ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్‌కు రమ్మని చెప్పారు. ఈ విధంగా మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అతను దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. ఆర్థిక సరళీకరణ ద్వారా వెంటిలేటర్‌కు చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ చికిత్స అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానించారు.

మన్మోహన్ సింగ్ విషయంలో పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసింది. కేవలం రెండేళ్లలోనే మన్మోహన్ సింగ్ తన ఆర్థిక విధానాలు, సరళీకరణతో విమర్శకుల నోరు మూయించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వెనుదిరిగి చూడలేదు. ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చాక రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా చేశారు. అతను 1998 నుండి 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2004లో దేశ ప్రధానిగా పదేళ్ల పాటు దేశ పగ్గాలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..