- Telugu News Photo Gallery Business photos Manmohan Singh's Signature on RBI Old Indian Rupees: The Untold Story Telugu News
Manmohan Singh: నోట్లపై సంతకం చేసిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.. కారణం ఇదే!
Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 26 రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే భారత కరెన్సీ నోట్లపై సంతకం చేసిన ప్రధాని ఒక్కరే. కారణం ఏంటో తెలుసా..?
Updated on: Dec 27, 2024 | 3:47 PM

దేశ మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డా. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. మన్మోహన్ సింగ్ తన పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.

మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కూడా దేశంలో ఆర్థిక విప్లవం సృష్టించారు. దివాలా తీసిన దేశాన్ని ప్రపంచంలోనే రెండో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. పాత నోట్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకం కనిపిస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు మాత్రమే దేశ రూపాయిపై సంతకం చేసే హక్కు ఉంటుంది. భారతదేశంలో చెలామణిలో ఉన్న ప్రతి నోటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ఉంటుంది. అలా అయితే, పాత నోటుపై ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ సంతకం ఎందుకు చేశారో తెలుసా? అందుకు కారణంన ఉంది.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి కాకముందు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1982లో మన్మోహన్ సింగ్ RBI గవర్నర్ పదవిని చేపట్టారు. మన్మోహన్ సింగ్ 1982 నుండి 1985 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారు. ఈ కాలంలో ముద్రించిన నోట్లపై ఆయన సంతకం ఉంటుంది.

మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్శిటీలో చదివి 1952, 1954లో ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు. తర్వాత ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన DPhil (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పూర్తి చేశారు.

మన్మోహన్ సింగ్ 1990 నుండి 1991 వరకు ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రి కాకముందు మూడు నెలల పాటు యూజీసీ చైర్మన్‌గా ఉన్నారు.




