మారుతి సుజుకి మైలేజ్ పరంగా చాలా మంచి కారు. న్యూ జెనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ 24.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే ఆటోమేటిక్ మోడల్ 25.75 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు 5700 ఆర్‌పీఎం వద్ద 80.4 బీహెచ్‌పీ, 4300 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.