AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric scooters: ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..! ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!

ఆధునిక కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. వివిధ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పట్టణాల ట్రాఫిక్ లో సులభంగా నడిపే వీలు ఉండడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా మోటారు సైకిళ్లు నడపటానికి డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే కొన్ని స్కూటర్లను లైసెన్సు లేకుండా నడపవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సు అవసరం లేదు. ఎలక్ట్రిక్ విభాగంలో ఇలాంటి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. నగరాల్లోని ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఇంతకంటే వేగంగా వెళ్లడం సాధ్యం కాదు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు, యువతకు ఇవి చాలా బాగుంటాయి. అలాంటి స్కూటర్ల ధర, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Dec 27, 2024 | 5:15 PM

Share
ఒకినావా ఆర్30 స్కూటర్ లో 1.25 కేడబ్ల్యూహెచ్ లిథియం - అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.61,998కి అందుబాటులో ఉంది.

1 / 5
ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో రూ.74,999కి అందుబాటులో ఉంది. దీనిలో1.25 కేడబ్ల్యూ రిమూవబుల్ లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. పూర్తిస్థాయిలో బ్యాటరీని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సుమారు 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

2 / 5
ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారికి డెల్టిక్ డ్రిక్స్ స్కూటర్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీనిలో 1.58 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ రూ.58,490 నుంచి రూ.84,990 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది.

3 / 5
హీరో ఎడ్డీ స్కూటర్ లో 30 ఏహెచ్ బ్యాటర్ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేయడానికి 4 నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. దాదాపు 85 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ రూ.72 వేలకు అందుబాటులో ఉంది.

4 / 5
అధిక రేంజ్ కోరుకునే వారికి కొమాకి ఎక్స్ జీటీ కేఎం స్కూటర్ చక్కగా సరిపోతుంది. ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 85 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.56,890 నుంచి రూ.93,045 మధ్య అందుబాటులో ఉంది.

5 / 5