- Telugu News Photo Gallery Spiritual photos Tirumala tirupati devasthanams devotees followed by sevas
Lord Venkateswara Swamy : వేయినామాలవాడు వెంకన్నకు రోజుకు ఎన్నిసార్లు సేవలు చేస్తారో తెలుసా.. !
కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవం తిరుమల వెంకన్న.. భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలవబడుతున్నాడు కోనేటిరాయుడు. ప్రపంచ ఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్తానం. ఈ ఆధ్యాత్మక ప్రదేశం శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు చేస్తారు. దీనిని ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. స్వామివారి సేవల గురించి తెలుసుకుందాం..!
Updated on: Mar 08, 2021 | 7:43 PM

తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే ప్రప్రథమ సేవ సుప్రభాత సేవ. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. దీనిని మేలుకొలుపు సేవ అని అంటారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమవుతాయి. బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ఏడాదిలో మార్గశిర మాసంలో తప్ప ప్రతిరోజు సుప్రభాత సేవను నిర్వహిస్తారు.

అలంకార ప్రియుడు మలయప్ప స్వామి.. తోమాల సేవలో భాగంగా స్వామివారిని పూలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజుల శుద్ధి అనంతరం తోమాల సేవను చేస్తారు.. ఒక్క శుక్రవారం రోజున మాత్రమే స్వామివారికి అభిషేకం జరిపించిన తర్వాత రెండవసారి మరల తోమాల సేవ చేస్తారు.

వెంకన్నను వెయ్యినామాలతో ఉదయం గంటల 4.45నిమిషాల నుంచి గం. 5.30నిమిషాల వరకు సహస్రనామార్చనను పూజారులు నిర్వహిస్తారు. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి సహస్రనామాలను (1008) స్తుతిస్తూ తులసి దళాలతో శ్రీవారికి అర్చన చేస్తారు.

ఏడుకొండలవాడికి అష్టోత్తర శతనామార్చనతో మధ్యాహ్న పూజలను ప్రారంభిస్తారు. ఈ సమయంలో స్వామిని వరాహపురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తూ పూజిస్తారు.

స్వామివారికి రాత్రి ఒకటిన్నర సమయంలో చేసే సేవనే పవళింపు సేవ లేదా ఏకాంత సేవ అంటారు. ఈ సమయంలో స్వామివారిని పూజించడానికి బ్రహ్మదిదేవతలు వస్తారని పూర్వకాలం పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. అందుకనే వారి ఆరాధన కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రలో ఉంచుతారు. ఆ తీర్ధాన్ని మర్నాడు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ పవళింపు సేవ సమయంలో స్వామివారికి అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీంతో ఆరోజుకి స్వామివారికి నిత్యపూజలు జరిగినట్లే..

ఏడుకొండల వాడకు ప్రతిరోజూ రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబ పాట పాడి హారతిని ఇమ్మని అప్పట్లో భక్తులు అడిగారట.. దీంతో అప్పటి నుంచి ముత్యాల హారతి స్వామివారి సేవల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సేవను తరిగొండ ముత్యాల హారతి అని అంటారు.




