- Telugu News Photo Gallery Spiritual photos Mysteries of ramanatha swamy temple rameshwaram tamilnadu in telugu
Tamilnadu Ramanatha Swamy Temple: తమిళనాడులో ఉన్న అతి పురాతన రామనాథ స్వామి దేవాలయ రహస్యాలు..
దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రాలలో దేవాలయాలన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో రామనాథ స్వామి దేవాలయం ఒకటి. ఈ రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ ఆలయం రహస్యాలు తెలుసుకుందాం.
Updated on: Mar 08, 2021 | 12:18 PM

ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారు చేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు "విశ్వలింగాన్ని" మొదట పూజించాలని తెలపడంతో ఆనాటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.

దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయానికి కూడా అతి పెద్ద ప్రహరీ నాలుగు వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి, మధ్యలో అధికంగా ఐదు అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి.

రెండవ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైనది. మూడవ కారిడార్ యొక్క పశ్చిమ వైపు, పశ్చిమ గోపురం నుండి సేవుమాథవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది "చొక్కట్టన్ మండపం"గా ప్రసిద్ధి చెందింది. ఇచట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు.

ఈ ఆలయంలో రామనాథస్వామి , విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్ తో వేరుచేయబడినాయి. ఇచట విశాలాక్షి,పర్వతవర్ధిని,ఉత్సవ విగ్రహం,శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. అనుప్పు మండపం, సుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం , నంది మండపం. జ్యోతిర్లింగాలు.

ఈ దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. తంజావూరును పరిపాలించు మహారాజులు "సత్రం" లేదా విరామ భవనాలను నెలకొల్పారు. ఇవి మయిలాదుతురై, రామేశ్వరం మధ్య 1745, 1837 లలో నెలకొల్పారు.





























