AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSA: స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళా క్రికెెట్ టీమ్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో

INDvSA: స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా
స్మృతి మంధనా అద్భుత ఇన్నింగ్స్
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2021 | 4:13 PM

Share

Smriti Mandhana:  దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో భారత మహిళా క్రికెెట్ టీమ్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరింత పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఆడి ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో మిథాలీసేన ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత టీమ్ కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది. దీనితో, ఇరు జట్ల మధ్య 5 వన్డే సిరీస్ ఇప్పుడు మరోసారి సమానంగా ఉంది. మొదటి 2 మ్యాచ్‌ల తరువాత, ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమానంగా ఉంది.

టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో  దుమ్మరేపారు. అద్భుత షాట్లతో అలరించి.. సునాయాస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా విమెన్స్ టీమ్ 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. భారత బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు.

చితక్కొట్టిన స్మృతి మంధనా

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా తన ఇన్నింగ్స్‌ను 2 బ్యాక్ టు బ్యాక్‌ సిక్సర్లతో ప్రారంభించింది. అదే దూకుడుతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని క్లాసిక్ ఫోర్లు  మంధనా బ్యాట్ నుంచి జాలువారాయి. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధనా 64 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆమె ఇన్సింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

అదరగొట్టిన పూనమ్ రౌత్

మరొక వైపు నుంచి, పూనం రౌత్ కూడా అదరగొట్టింది. సెంచరీ భాగస్వామ్యంలో మంధనకు ఆమె మంచి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే పూనమ్ 14 వ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.  ఆమె 89 బంతుల్లో 62 పరుగులు చేశారు. అందులో 8 ఫోర్లు ఉన్నాయి.

 దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బారత బౌలర్లు

అంతకుముందు రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లఖ్​నవూ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను స్థిరంగా ఆడనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో జులాన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికాను పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడనివ్వలేదు. ఫలితంగా, 41 ఓవర్లలో 157 పరుగులు చేసిన విజిటింగ్ జట్టు ఆలౌట్ అయింది. భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

Follow Us
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ