Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Seized : లక్ష ద్వీప్ : భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. ఆరుగురు శ్రీలంక దేశీయుల అరెస్ట్.. డ్రగ్స్‌ విలువ ఎంతో తెలుసా..?

drugs seized in Lakshyadweep : అధికారులు ఎన్ని విధాల ప్రయత్నించినా మత్తు పదార్థాల రవాణాను అరికట్టలేకపోతున్నారు. నిత్యం నగరాల్లో రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నాయి.

Drugs Seized : లక్ష ద్వీప్ : భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..  ఆరుగురు శ్రీలంక దేశీయుల అరెస్ట్.. డ్రగ్స్‌ విలువ ఎంతో తెలుసా..?
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2021 | 3:26 PM

drugs seized in Lakshyadweep : అధికారులు ఎన్ని విధాల ప్రయత్నించినా మత్తు పదార్థాల రవాణాను అరికట్టలేకపోతున్నారు. నిత్యం నగరాల్లో రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నాయి. కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నగరాల్లోని పబ్‌లు, రిసార్ట్లు తదితర వాటిల్లో విక్రయాలు జరుపుతున్నారు. అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. అయితే అమాయకులైన విద్యార్థులు, యువతులు, బడాబాబుల పిల్లలే వీరి టార్గెట్‌గా వ్యాపారం నడుస్తోంది. అంతేకాకుండా యువత వీటి భారిన పడి అనారోగ్యాలకు గురై ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు.

తాజాగా లక్షద్వీప్ లో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. ఆరుగురు శ్రీలంక దేశస్తులను కోస్ట్‌గార్డు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 200 కిలోల హెరాయిన్, 60 కిలోల హాశిస్ మత్తు పదార్ధాలను గుర్తించారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. వేయి కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ ఇంకా చాలా దేశాలకు పాకి ఉన్నట్లుగా తెలుస్తోంది. కోస్ట్‌గార్డు అధికారులు శ్రీలంక దేశస్తులని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నైజీరియా దేశస్థులకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Maoists Targets: పినపాక నియోజకవర్గంలో మావోయిస్టుల కలకలం.. వ్యాపారికి బెదిరింపులు.. సుక్మా వచ్చి కలవాలని ఆదేశాలు..

నిజామాబాద్‌ జిల్లా ధర్యాపూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఆగ్రహిస్తున్న గ్రామస్థులు.. నిందితులను పట్టుకోవాలని డిమాండ్..

Police Arrested BJP Leaders : కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ ఇతడే.. తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదంటున్న పాకిస్తాన్ మాజీ సారథి..