Hero Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్.. కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లి నీతు కపూర్ మంగళవారం ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం

  • Rajitha Chanti
  • Publish Date - 12:39 pm, Tue, 9 March 21
Hero Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్.. కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లి నీతు కపూర్ మంగళవారం ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
“ప్రస్తుతం రణదీర్ కోలుకుంటున్నాడు. హోం క్యారంటైన్లోనే ఉన్నాడు. మెడిసిన్ వాడుతున్నాడు. మీ అభిమానానికి ధన్యావాదలు” అంటూ షేర్ చేసింది నీతు కపూర్. ఎంఎస్ కపూర్ కూడా గత డిసెంబర్‌లో వైరస్ నుంచి కోలుకున్నాడు.

ముంబై స‌హా మ‌హారాష్ట్రలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ప్ర‌తి రోజు ప‌దివేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేన్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నీతూ కపూర్, అర్జున్ కపూర్, కృతి సనన్, మలైకా అరోరా ఇంకా చాలామంది వైరస్ బారినపడి కోలుకున్నారు. రణ్​బీర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు . కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న షంషేరాతో పాటు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బ్రహ్మాస్త్ర లో న‌టిస్తున్నాడు.