Sanjay Leela Bhansali : బాలీవుడ్‌లో మళ్ళీ కరోనా కలకలం.. సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో అలియా భట్
బాలీవుడ్ లో మళ్ళీ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారన్న వార్త వినిపించాయి. తాజాగా మరో బాలీవుడు ప్రముఖుడు కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. దర్శకుడు , నిర్మాత ...
Sanjay Leela Bhansali : బాలీవుడ్ లో మళ్ళీ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారన్న వార్త వినిపించాయి. తాజాగా మరో బాలీవుడు ప్రముఖుడు కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. దర్శకుడు , నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీ టౌన్ టాక్. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్న సంజయ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరోవైపు గంగూబాయి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఆలీయా భట్ హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు . చిత్ర షూటింగ్ సమయంలో తనతో పాటు ఉన్న చిత్ర బృందాన్ని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని ఆయన కోరారు.
దీంతో అలియా భట్ లీడ్ పాత్రలో నటిస్తున్న గంగూబాయి కతియావాడి సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇక మరోవైపు గంగూబాయికతియావాడీ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమా పేరు మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. గంగూబాయి సినిమా పేరు మార్చాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు. కాతియవార్ ప్రాంతం ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా ఉందని అమిన్ పటేల్ చెప్పారు.
ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం గంగూబాయి కి వ్యతిరేకంగా ఇటీవల కామతీపుర ప్రజలు ముంబైలో ప్రదర్శనలు చేశారు. కామతీపుర ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతం అని ఇక నుంచి దయచేసి చెప్పకండి.. ఎందుకంటే అక్కడ ఉన్న యువత ఇప్పుడు ఆ ప్రాంతం ఇమేజ్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు అభ్యర్థిస్తున్నారు.
మరోవైపు గంగూబాయి కతియావాడి చిత్రం టీజర్ విడుదలై.. అలియా నటనకు సర్వత్రా ప్రశంసలను అందుకుంటుంది. టీజర్‌లో, అలియా భట్ నటనను చూసిన వారు ఆమె కెరీర్‌లో మంచి పాత్ర అని అంటున్నారు. సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తుండగా.. గంగూబాయికతియావాడీ లో అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: