- Telugu News Photo Gallery Business photos Alert for andhra bank customers these changes will come into effect from 1st april 2021
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఇకపై..
Updated on: Mar 09, 2021 | 2:55 PM

Union Bank

ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు కొత్త పాస్‌బుక్స్ అందిస్తారు. ఆ పాత బుక్స్ అన్నీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రాబ్యాంక్ కస్టమర్లు తమ పాస్ బుక్స్ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్ యాప్ పని చేయదు. కస్టమర్లు U-Mobile యాప్ ఉపయోగించాలి.

ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంక్ చెక్స్ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పని చేస్తాయి. ఆ తర్వాత పని చేయవు. అంటే మీరు ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) చెక్స్ మాత్రమే ఉపయోగించాలి. కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలి.

ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా మారుతుంది. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ 2021 మార్చి 31 వరకే పని చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 కాగా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110. సంప్రదించాలి.

ఇటీవల ఆంధ్రా బ్యాంక్ అన్ని బ్రాంచుల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తయిందని యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలు అందించిన అన్ని సర్వీసులు బ్రాంచ్‌లు, స్పెషలైజ్ఢ్ బ్రాంచులు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసంధానమయ్యాయి.

ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఐదో స్థానంలో ఉంది. నెట్‌వర్క్ విషయంలో నాలుగో స్థానంలో ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 9590పైగా బ్రాంచ్‌లు, 13,287 ఏటీఎంలు ఉన్నాయి.





























