నాలుగేళ్లుగా రాష్ట్రానికి సేవ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు, రావత్
నాలుగేళ్లుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.

నాలుగేళ్లుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ తనకు బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చిందని, ఒకచిన్న గ్రామంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ ఎంతో గౌరవం కూడా ఇఛ్చి సీఎంను చేసిందని అన్నారు. తన విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని, ఇక తను అధికారాన్ని మరొకరికి అప్పగించాల్సి ఉందని ఆయన చెప్పారు.సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ రేపు ఉదయం 10 గంటలకు సమావేశమవుతుందని, దీనికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతారని త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.
రావత్ రాజీనామాపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్ రావత్..బీజేపీ అధికారంలోకి రాజాలదని ఈ రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుత నాయకత్వం పని చేయజాలదని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించిందని, ఎవరిని ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టినా.. 2022 లో మళ్ళీ వారు అధికారంలోకి రాజాలరని ఆయన ట్వీట్ చేశారు. ఇలా ఉండగా త్రివేంద్ర సింగ్ సన్నిహితులైన కొందరు నేతలు .. ఆయన రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ కు 57 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని అంతకు ముందు వీరు పేర్కొన్నారు. తమ నేత బలహీన నాయకుడన్న ఆరోపణలను వారు ఖండించారు. కొందరు కావాలనే లేనిపోని ఆరోపణలు చేసి ఈ పరిస్థితిని సృష్టించారని వారు వ్యాఖ్యానించారు. నిజానికి ఉత్తరాఖండ్ లో రాజకీయ పరిస్థితి అంతా బాగానే ఉందని, ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల సన్నాహాలను సమీక్షించేందుకు ఇద్దరు కేంద్ర నేతలు కూడా రాష్ట్రాన్ని సందర్శించారని బీజేపీ ఎంపీ అజయ్ భట్ అన్నారు. పైగా తివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వ నాలుగో యానివర్సరీని కూడా ఆ సందర్భంగా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు పొలిటికల్ సిచువేషన్ పూర్తిగా మారిపోయింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
China: మగవారు లేని మహిళ రాజ్యం గురించి మీకు తెలుసా…!