AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, పాకిస్తాన్‌ ‘వంటగది’లో రేట్ల మంట..

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. నిత్యవసర సరుకులు అందుబాటులో లేక పోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటితోపాటు చికెన్, మటన్‌ ధరలు ఒక్కసారిగా

1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, పాకిస్తాన్‌ 'వంటగది'లో రేట్ల మంట..
PAKISTAN EGG
Sanjay Kasula
|

Updated on: Mar 09, 2021 | 8:41 PM

Share

Egg Price Hike: పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ రాబడిని పెంచడమే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు పెంచేసింది. పన్నులు పెంచిన జాబితాలో కోడి గుడ్లు, మాంసం కూడా ఉన్నాయి. నిత్యవసర సరుకులు అందుబాటులో లేక పోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వీటితోపాటు చికెన్, మటన్‌ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చికెన్, మాంసం కాకుండా, పాకిస్తాన్లో గుడ్లు , అల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో గుడ్డు ధరలను డజనుకు 350 రూపాయలకు చేరింది. అదే సమయంలో ఇక్కడ  కిలో అల్లం రూ. 1000 చేరింది. పాకిస్తాన్‌లోని మార్కెట్‌లో ఏ వస్తువు ముట్టుకున్నా బగ్గుమంటోంది.

పాకిస్తాన్ “ARY న్యూస్” నివేదిక ప్రకారం.. కరాచీలో లైవ్ చికెన్ ధర కిలోకు రూ. 370, మటన్ కిలోకు 500 రూపాయలు. అదే సమయంలో, లాహోర్లో చికెన్ ధర కిలోకు 365 రూపాయలు పలుకుతోంది.  పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీటితోపాటు కరాచీలో ముడిసరుకులతోపాటు  పశుగ్రాసం ధరలు కూడా భాగా పెరిగాయి.. దీని కారణంగా పౌల్ట్రీ రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కొద్ది రోజుల్లో మాంసం ధరలు తగ్గుతాయని వర్తక సంఘం పేర్కొంది. అదే సమయంలో పౌల్ట్రీ పరిశ్రమకు కావల్సిన వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

పాకిస్తాన్ గ్యాస్ కొరత..

పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మార్కెట్ కమిటీలను రద్దు చేశారు. ఇందుకు పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అవినీతి పెరిగిపోవడం ఓ కారణంగా అక్కడి పత్రికలు చెబుతున్నాయి. మాంసంతోపాటు కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. అయితే వీటితోపాటు గ్యాస్ కొరత కూడా అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. 2021 సంవత్సరం ప్రారంభం నుండి పాకిస్తాన్ తీవ్రమైన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌కు గ్యాస్ సరఫరా చేసే సూయి నార్తర్న్‌ గ్యాస్ దేశం మొత్తంకు సరిపడే ఎల్పీజీ గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నది. ఈ కారణంగా, పాకిస్తాన్‌కు సరఫరా చేసే గ్యాస్‌ను కంపెనీ నిషేధించింది.

చెక్కర ధర తగ్గింది…

గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌లో చక్కెరను కిలోకు 81 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు పార్టీ తరపు వారు ట్వీట్ చేశారు. ఇది ఆయన ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీల వల్ల చక్కెర ధర కిలోకు 102 రూపాయల నుంచి 81 రూపాయలకు తగ్గిందని విమర్శలను తిప్పి కొడతున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఇమ్రాన్ ఖాన్ ను విపరీతంగా ఎద్దేవ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Viagra of Himalayas: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ‘పురుగు’ శిలీంధ్రం..హిమాలయన్ వయాగ్రాగా పిలిచే దీని ధర ఎంతో తెలుసా..!

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..