Novak Djokovic New Record: చిన్నప్పుడు చెప్పాడు.. ఇప్పుడు సాధించాడు.. ఈ వీడియో చూస్తే జొకోవిచ్ సూపర్ అనాల్సిందే!

Novak Djokovic New Record: ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు. టెన్నీస్ వరల్డ్ చాంపియన్‌గా..

Novak Djokovic New Record: చిన్నప్పుడు చెప్పాడు.. ఇప్పుడు సాధించాడు.. ఈ వీడియో చూస్తే జొకోవిచ్ సూపర్ అనాల్సిందే!
Follow us

|

Updated on: Mar 09, 2021 | 9:05 PM

Novak Djokovic New Record: ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు. టెన్నీస్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి స్వి్ట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్విస్ టెన్నిస్ స్టార్ కంటే ఒక వారం ఎక్కువగా చాంపియన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాడు. సరికొత్త రికార్డ్ నెలక్పొల్పడంపై జొకోవిచ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ‘దిగ్గజాల సరసన చేరడం నాకు నిజంగా సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు జొకోవిచ్. ‘చిన్ననాటి కల సాకారం అవడం నిజంగా అద్భుతంగా ఉంది. కృషి, పట్టుదల, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదల వల్ల ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నాడు.

Novak Djokovic Tweet:

‘ఈ చారిత్రాత్మక ఘటనతో నాకు రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు నేను పూర్తిగా స్లామ్స్‌పై దృష్టిని కేంద్రీకరించవచ్చు.’ అని సెర్బియన్ స్టార్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. జొకోవిడ్ ముంగిట మరో లక్ష్యం కొలువుదీరి ఉంది. టెన్నీస్ లెజెండ్స్ రోజర్ ఫెదరర్, నాదల్ ఆల్‌టైమ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ 20 కొట్టారు. ఆ సంఖ్యకు చేరువలో జొకోవిచ్ ఉన్నాడు. దాంతో ఆ టార్గెట్‌ను ఎలాగైనా రీచ్ అవ్వాలని పట్టుదలతో ఉన్నాడు సెర్బియన్ స్టార్. ఈ లక్ష్యం కూడా రీచ్ అయినట్లయితే జొకోకి తిరుగులేనట్లే అని చెప్పాలి.

ఇదిలాఉంటే.. జొకోవిడ్ నెంబర్‌ వన్‌గా నిలిచిన నేపథ్యంలో అతను చిన్నప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం.. ఆ వీడియోలో జొకోవిచ్ ఏనాటికైనా నెంబర్ వన్ టెన్నీస్ స్టార్ కావాలనేదే నా లక్ష్యం అని చెప్పాడు. నాటి తన గోల్‌ను.. నేడు నెరవేర్చుకోవడంతో నెటిజన్లు, అభిమానులు జొకోకు అభినందనలు తెలుపుతున్నారు.

Novak Djokovic Childhood Interview:

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జులై 1, 2021 నుంచి పెంచిన డీఏ అమలు.. ప్రకటించిన ఆర్థిక మంత్రి..

UPSC IES, ISS పరీక్ష 2020 ఇంటర్వ్యూ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల.. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం

Flipkart Smartphone Carnival: ప్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌