7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జులై 1, 2021 నుంచి పెంచిన డీఏ అమలు.. ప్రకటించిన ఆర్థిక మంత్రి..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త. మూడు విడతలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ను జులై 1, 2021 నుంచి..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జులై 1, 2021 నుంచి పెంచిన డీఏ అమలు.. ప్రకటించిన ఆర్థిక మంత్రి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 09, 2021 | 8:40 PM

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త. మూడు విడతలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ను జులై 1, 2021 నుంచి పునరుద్ధరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంగళవారం నాడు రాజ్యసభలో విపక్షాలు అడిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మూడు నెలలగా పెండింగ్‌లో ఉన్న సవరించిన రేట్లతో కూడిన డీఏ, డీఆర్‌ను జులై 1, 2021 నుంచి అమలు పరుస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ 19 సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లింపులను నిలిపివేశామని తెలిపిన ఆయన.. దీని కారణంగా 2020 సంక్షోభ సమయంలో ప్రభుత్వం రూ. 37,000 కోట్లకు పైగా ఆదా చేసిందన్నారు. ఆదా చేసిన సొమ్ము కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సహాయపడిందన్నారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పెన్షన్‌దారుల డీఆర్‌ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ ప్రకటించింది. పెంచిన మొత్తం జులై 2020 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన డీఏ, డీఆర్‌ను ఏప్రిల్ 2021 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక పెంచిన రేట్లతో కూడిన డీఏ, డీఆర్‌ను జులై 2021 నుంచి అమలు చేస్తామని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించారు.

“1-1-2020, 1-7-2020, 1-1-2021 మూడు విడుతల డీఏ, డీఆర్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. గతేడాది పెంచిన 4శాతం డీఏ, డీఆర్ రేట్లతో కలిపి జులై 2021 నుంచి అమలు చేస్తాం. వాస్తవానికి ఇది 2021 జనవరి 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు డీఏ, డీఆర్ నిలిపివేశాం’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Also read:

UPSC IES, ISS పరీక్ష 2020 ఇంటర్వ్యూ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల.. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం

Sreekaram Grand Release Event LIVE: ఘనంగా శ్రీకారం గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..