Jyotiraditya Scindia: అప్పుడే స్పందించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి.. రాహుల్‌పై సింథియా ఘాటు వ్యాఖ్యలు

Jyotiraditya Scindia on Rahul Gandhi: జ్యోతిరాధిత్య సింథియా గతేడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారిన కొన్ని నెలల తరువాత నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సింథియా కాంగ్రెస్‌లో ఉండి..

Jyotiraditya Scindia: అప్పుడే స్పందించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి.. రాహుల్‌పై సింథియా ఘాటు వ్యాఖ్యలు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2021 | 9:05 PM

Jyotiraditya Scindia on Rahul Gandhi: జ్యోతిరాధిత్య సింథియా గతేడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారిన కొన్ని నెలల తరువాత నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవార‌ని.. కానీ బీజేపీలో చేరి బ్యాక్‌బెంచ‌ర్‌గా మారారంటూ రాహుల్ గాంధీ సోమవారం పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఘాటుగా స్పందించారు. అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకంటూ సింధియా మంగళవారం ప్రశ్నించారు. ఆ రోజుల్లోనే పార్టీ గురించి, తనగురించి శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవంటూ ఆయన ఎఎన్ఐ వార్త సంస్థతో పేర్కొన్నారు. రాహుల్ ఇప్పుడు ఆందోళన చెందుతున్న మాదిరిగానే అప్పుడే స్పందిస్తే బాగుండేదంటూ చురకలంటించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడు జ్యోతిరాధిత్య సింథియా గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. అనంతరం ఆయన రాజ్యసభకు సైతం ఎన్నికయ్యారు. దాదాపు 15ఏళ్లకు పైగా ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ సింధియా గురించి మాట్లాడారు. ఒక‌వేళ జ్యో‌తిరాధిత్య సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే, ఇప్పుడు ఆయ‌న‌ ముఖ్యమంత్రి అయ్యేవార‌ని… బీజేపీలో చేర‌డం వ‌ల్ల బ్యాక్‌బెంచ‌ర్‌గా మారారంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏదో ఒక రోజు సీఎం అవుతార‌ని సింథియాకు చెప్పాన‌ని, కానీ ఆయ‌న మరో మార్గాన్ని ఎంచుకున్నార‌ంటూ విమర్శించారు. అక్క‌డ ఆయ‌న ఎన్న‌టికీ ముఖ్యమంత్రి కాలేరు.. ఆ ప‌ద‌వి కావాలంటే ఇక్క‌డ‌కు రావాల్సిందేనంటూ రాహుల్ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి కీలక నేతగా ఎదిగిన జ్యోతిరాధిత్య సింథియా పలు పదవులను సైతం చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కమల్ నాథ్ సీఎం, జ్యోతిరాధిత్య సింథియా డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. అనంతరం వారిమధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో జ్యోతిరాధిత్య సింధియాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Also Read:

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!