UPSC IES, ISS పరీక్ష 2020 ఇంటర్వ్యూ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల.. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం
UPSC IES, ISS: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ (ఐఈఎస్) 2020 మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) 2020 ఇంటర్వ్యూల.
UPSC IES, ISS: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ (ఐఈఎస్) 2020 మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) 2020 ఇంటర్వ్యూల పరీక్ష షెడ్యూల్‌ను విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అయితే రాత పరీక్ష విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు షెడ్యూల్ తేదీ ప్రకారం ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించింది. ఐఈఎస్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహించబడుతాయి. మరో వైపు ఏప్రిల్ 19 నుంచి 23 వరకు ఐఎస్‌ఎస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూలు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట కు ప్రారంభమవుతాయి. అయితే ప్రచురించిన జాబితాలు అభ్యర్థులను వారి సంఖ్య ఆధారంగా సెషన్లుగా విభజించారు.
షెడ్యూల్‌ను ఎలా చూడాలి..
ముందుగా యూపీఎస్సీ యొక్క వెబ్‌సైట్‌కు వెళ్లాలి. హోమ్ పేజీలో యూపీఎస్‌సీ ఐఇఎస్, ఐఎస్‌ఎస్ ఇంటర్వ్యూ షెడ్యూల్ 2020 అనే దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో యూపీఎస్‌సీ, ఐఈఎస్ మరియు ఐఎస్‌ఎస్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రత్యక్షమవుతుంది. మీరు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి చదవండి :
SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500