Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌

Flipkart Smartphone Carnival: కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్లలో మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే..

Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2021 | 1:06 PM

Flipkart Smartphone Carnival: కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్లలో మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మొబైల్‌ వాడకం ఎక్కువైపోతుండటంతో వారికి తగ్గట్లుగా మొబైళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి సదరు కంపెనీలు. ఇక అందుకు తగినట్లుగా ఈ-కామర్స్‌ దిగ్గజాలు కూడా కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్‌లో బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ కార్నివల్‌ ప్రారంభం అయింది. మార్చి 12వ తేదీ నుంచి ఈ సేల్‌ కొనసాగుతుంది. ఇందులో స్మార్ట్‌ ఫోన్లపై దాదాపు రూ.500ల నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులపై రూ.1,250 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక పలు మొబైళ్లపై ఆఫర్లు ఇలా ఉన్నాయి..

మోటోరోలా ఈ7 ప్లస్‌ (Motorola Moto E7 Plus) స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ+64 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. రూ.9,999. ఆఫర్ ధర రూ.9,499లకు లభిస్తుంది.

రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ (Realme 7 Pro) 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 ఉండగా, ఆఫర్‌ కింద రూ.17,999లకు లభిస్తోంది.

పోకో ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్‌ (POCO X3) స్మార్ట్‌ ఫోన్‌ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 ఉండగా, ఆఫర్ ధర రూ.14,499 వస్తోంది.

అలాగే రియల్‌మీ 7 స్మార్ట్‌ ఫోన్‌ (Realme 7) 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 ఉండగా, ఆఫర్‌లో రూ.13,999 వస్తోంది.

రియల్‌మీ 12 (Realme C12) స్మార్ట్‌ ఫోన్‌ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ. 9,999 ఉండగా, ఆఫర్‌లో రూ.8,999కు లభిస్తోంది.

రియల్‌ మీ సీ 15 (Realme C15) స్మార్ట్‌ ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 ఉండగా, ఆఫర్‌లో రూ.8,999లకే లభిస్తోంది.

రియల్‌ మీ సీ3 (Realme C3) స్మార్ట్‌ ఫోన్‌ 3జీబీ+32జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.8,999 ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ.7,999లకే లభిస్తోంది.

రియల్‌ మీ నార్జో 20 ప్రో (Realme Narzo 20 Pro) స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 ఉండగా, ఇందులో ఆఫర్‌గా రూ.13,999 లభిస్తోంది.

యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ (Apple iPhone SE) స్మార్ట్‌ ఫోన్‌ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.34,999 ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ.29,999 వస్తోంది.

పోకో సీ 3 (POCO C3) స్మార్ట్‌ ఫోన్‌ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499 ఉండగా, ఆఫర్‌లో రూ.6,999కు లభిస్తోంది.

పోకో ఎం 2(POCO M2 Pro): స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 ఉండగా, ఆఫర్‌లో ధర రూ.11,999 వస్తోంది.

రియల్‌ మీ ఎక్స్‌ 3 సూపర్‌ జూమ్‌ (Realme X3 Superzoom) స్మార్ట్‌ ఫోన్‌ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.27,999 ఉండగా, ఆఫర్‌లో రూ.22,999 లభిస్తోంది.

రియల్‌ మీ ఎక్స్‌ 50 ప్రో (Realme X50 Pro) స్మార్ట్‌ ఫోన్‌ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.41,999 ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ.31,999లకే లభిస్తోంది.

సాంసంగ్‌ గెలక్సీ ఎఫ్‌ 41 (Samsung Galaxy F41) స్మార్ట్‌ ఫోన్‌ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 ఉండగా, ఆఫర్ కింద రూ.15,499లకు లభిస్తోంది.

సాంసంగ్‌ గెలక్సీ ఏ21 ప్లస్‌ ఎస్‌ (Samsung Galaxy A21s) స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా, ఆఫర్‌లో రూ.12,999 లకే లభిస్తోంది. ఇలా ఫ్లిప్‌ కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై ఎన్నో ఆఫర్లు ఇస్తోంది. కొనుగోలు చేసేవారు ఇప్పుడు బుక్‌ చేసుకుంటే తక్కువ ధరల్లో వచ్చేస్తున్నాయి.

ఇవి చదవండి :

రూ.13 వేలు తగ్గిన బంగారం

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు

Maruti Suzuki: గొప్ప అవకాశం.. లక్షా అరవై వేలకే మారుతి ఆల్టో కారు.. ఆఫర్ వివరాలు తెలుసుకోండిలా..