AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: గొప్ప అవకాశం.. లక్షా అరవై వేలకే మారుతి ఆల్టో కారు.. ఆఫర్ వివరాలు తెలుసుకోండిలా..

Maruti Suzuki Alto: ఆర్థికమైన పరిస్థితుల కారణంగా.. మీరు కారు కొనలేకపోతున్నారా.. అయితే మీ లాంటి వారి కోసం దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని..

Maruti Suzuki: గొప్ప అవకాశం.. లక్షా అరవై వేలకే మారుతి ఆల్టో కారు.. ఆఫర్ వివరాలు తెలుసుకోండిలా..
Maruti Suzuki Alto
Shaik Madar Saheb
| Edited By: Team Veegam|

Updated on: Mar 10, 2021 | 11:13 AM

Share

Maruti Suzuki Alto: ఆర్థికమైన పరిస్థితుల కారణంగా.. మీరు కారు కొనలేకపోతున్నారా.. అయితే మీ లాంటి వారి కోసం దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. అది కూడా మంచి ఆఫర్లతో అందిస్తోంది. దీని ద్వారా మీరు అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. అంటే కేవలం రెండు లక్షలకు తక్కువగానే కారును సొంతం చేసుకోవచ్చని మారుతి పేర్కొంది. దీనిలో భాగంగా మారుతి సుజుకి ట్రూ వాల్యూ ద్వారా సెకెండ్ హ్యాండ్ కార్లను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. వీటిని టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈఎమ్ఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

ట్రూ వాల్యూలో పేర్కొన్న దాని ప్రకారం.. మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మారుతి ఆల్టో కారు ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో 1,62000 రూపాయలకు మాత్రమే అమ్ముడవుతోంది. మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్ ద్వారా పాత కార్ల విక్రయాలు చేపడతుతోంది. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆల్టో 800 ఎల్‌ఎక్స్‌ఐని కేవలం 1 లక్ష 62 వేల రూపాయలు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 2016 కి చెందిన ఆల్టో కారు ఇప్పటివరకు 31218 కిలోమీటర్లు నడిచింది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ పాత ఆల్టో 800 కారును ఎల్‌ఎక్స్ఐ ట్రూ వాల్యూలో కొన్న అనంతరం 6 నెలల వారంటీ, మూడు సార్లు సర్వీసింగ్ సేవలు మొదలైనవి కూడా లభిస్తాయి. ఆల్టో కారు కోసం (https://www.marutisuzukitruevalue.com/buy-car/alto-800-in-sagar-2016/AXfd3OzyZPsTbFxud9_V) ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

మారుతి సుజుకి ట్రూ వాల్యూ కింద.. మారుతిలో పలు మోడళ్ల సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు www.marutisuzukitruevalue.com వెబ్‌సైట్‌లో సెకెండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన వివరాలు, ధర, డీలర్ చిరునామా, యజమానుల పేర్లు పొందపరిచి ఉంటారు. మీ మొబైల్ నెంబర్ చిరునామా లాంటివి వెబ్‌సైట్‌లో పొందుపరిచి టస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీకెమైనా కార్లు కావాలంటే.. www.marutisuzukitruevalue.com/buy-car/ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోండి.

Also Read: Viagra of Himalayas: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ‘పురుగు’ శిలీంధ్రం..హిమాలయన్ వయాగ్రాగా పిలిచే దీని ధర ఎంతో తెలుసా..!

Benefits Of Honey: తేనెతో అన్నీ ఆరోగ్య ప్రయోజనాలే.. తెలిస్తే మీరే షాకవుతారు..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!