- Telugu News Health Health benefits of honey amazing health benefits of honey used in medicinal purpose
Benefits Of Honey: తేనెతో అన్నీ ఆరోగ్య ప్రయోజనాలే.. తెలిస్తే మీరే షాకవుతారు..
Health Benefits Of Honey: తేనేతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తేనెను ఆయుర్వేదంతోపాటు పలు చికిత్సల కోసం వినియోగిస్తుంటారు. అయితే తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని వింటాం కానీ మనం ..
Updated on: Mar 09, 2021 | 2:50 PM

Health Benefits Of Honey: తేనేతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తేనెను ఆయుర్వేదంతోపాటు పలు చికిత్సల కోసం వినియోగిస్తుంటారు. అయితే తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని వింటాం కానీ మనం పట్టించుకోం. తెనేవల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనెలో విటమిన్ సి, విటమిన్ బీ6, ఫ్రక్టోస్, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లోవిన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల లాభాలు తప్పితే.. నష్టాలేమీ ఉండవని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

తేనే కాలిన గాయాలు, ఇతర గాయాల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. గాయమైన చోట తేనే రాస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సురక్షితంగా కాపాడుకోవచ్చు.

తేనే బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కాస్త తేనెను నీళ్లలో కలిపి తీసుకుంటే కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

గోరు వెచ్చని నీటిలో మిరియాలపొడి, తేనె, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీటిలో తేనె కలుపుకొని తాగితే ఇంకా మంచిది.

తేనె యంటీబయాటిక్‌గా పని చేస్తుంది. దగ్గు, గొంతు సమస్యను నియంత్రిస్తుంది. జలుబు తదితర రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.




