AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Health Benefits : పండ్లలలో రారాజు.. మామిడి పండు వచ్చేసింది.. మరి ఈ పండుతినడం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

వేసవి వచ్చేసింది. ఇక ప్రతి వారి చూపు పండ్లలో రారాజు మామిడి పండు వైపే ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇక మార్కెట్లోకి మామిడి పండు...

Mango Health Benefits : పండ్లలలో రారాజు.. మామిడి పండు వచ్చేసింది.. మరి ఈ పండుతినడం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా..!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Surya Kala
|

Updated on: Mar 08, 2021 | 10:37 PM

Share

Mango Health Benefits : వేసవి వచ్చేసింది. ఇక ప్రతి వారి చూపు పండ్లలో రారాజు మామిడి పండు వైపే ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇక మార్కెట్లోకి మామిడి పండు వచ్చిందంటే చాలు అందరి చూపు అందరివైపే… ఇక ఈ సీజన్ లో అధికంగా లభించే మామిడి పండ్లను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చాలా మంది మామిడి పండును భోజనం చేసిన అనంతరం తింటారు.

మామిడి పండు తినడం వల్ల ఉపయోగాలు:

*ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

*మామిడి పండ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి. దీంతో వీటిని తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగదు కానీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, మరియు పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయ పడడమే కాదు.. మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది.

*మామిడి పండు క్యాన్సర్ ను ఎదుర్కోవడమే కాదు.. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ను నివారించే సామర్ధ్యం ఉందని పరిశోధన ద్వారా తెలిసింది. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే లుకేమియా మరియు ఇతర రకాల క్యాన్సర్ ను ఎదుర్కొనే శక్తి మామిడిపండ్లలో ఉంది.

*మామిడిపండ్లలో ఉండే మాలిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ ను కలిగి ఉండటం వల్ల ఇది ఎసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

*మామిడి పండు తినడం వల్ల దంత సమస్యలు తొలగిపోతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశించి దంతాలను ధృడంగా చేస్తుంది. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది

* మామిడి పండు రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది.

సో.. సహజంగా పండే మామిడి పండ్లను సమ్మర్ లో తినండి.. మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి…!

Also Read:

Aratikaya Podi Kura : ఎంతో రుచికరమైన అరటికాయ పొడి కూర తయారీ విధానం ఇలా…!

ఉన్మాదం చేసిన గాయంతో గొంతు పలకడం లేదు.. అయినా మంచంపై నుంచే మహిళా లోకానికి లేఖ రాసిన ప్రియాంక..