AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aratikaya Podi Kura : ఎంతో రుచికరమైన అరటికాయ పొడి కూర తయారీ విధానం ఇలా…!

అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒకటి పండినవి తినడానికి.. రెండోది కేవలం కూర చేసుకోవడానికి. ఇక అధిక పోషక విలువలు కలిగిన ఈ అరటి కాయతో పాటు అరటి పువ్వు, దూట అన్నీ కూడా కూరగా చేసుకుంటారు...

Aratikaya Podi Kura : ఎంతో రుచికరమైన అరటికాయ పొడి కూర తయారీ విధానం ఇలా...!
Surya Kala
|

Updated on: Mar 08, 2021 | 10:10 PM

Share

Aratikaya Podi Kura  : అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒకటి పండినవి తినడానికి.. రెండోది కేవలం కూర చేసుకోవడానికి. ఇక అధిక పోషక విలువలు కలిగిన ఈ అరటి కాయతో పాటు అరటి పువ్వు, దూట అన్నీ కూడా కూరగా చేసుకుంటారు. ఇక లేత అరటి కాయలు అయితే అజీర్ణం చేయవు. ఈ అరటితో రాకరకాల వంటలు చేస్తారు. ఈరోజు అరటికాయ పొడి చేసుకోవడం తెలుసుకుందాం..!

కావలసిన పదార్ధాలు :

అరటికాయలు 4 పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి ఉప్పు, పసుపు కారం

అరటికాయ పుడి తయారీ విధానం :

మొదట అరటికాయలు బాగా కడిగి తొక్కతో సహా కుక్కర్లో ఉంచి నీరుపోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి దించాలి. అవి చల్లారిన తర్వాత అరటికాయ తొక్కలు తీసి లోపలి భాగాన్ని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాణలిని గ్యాస్ స్టౌ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత నూనె వేసి ఆవాలు చిటపటలాడించి కాస్త పచ్చి శనగపప్పు , రెండు ఎండుమిర్చి వేసి వేయించి తర్వాత తరిగిన ఉడికిన అరటికాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు,పసుపు వేసి కలియబెట్టి మూతపెట్టాలి. వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు కొంచెం కూరపొడిని వేసి ఉప్పు చూసుకుని కొంచెం సేపు తర్వాత దించేయాలి. అంతే రుచికరమైన అరటికాయ పొడి రెడీ ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.

కూర పొడి తయారీకి పదార్ధాలు తయారీ విధానం :

పచ్చి శెనగపప్పు 200 గ్రాములు ధనియాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర 2 టీస్పూన్ లు ఎండుమిరప కాయలు 25

వీటన్నిటిని వేరు వేరుగా నూనెల లేకుండా వేయించాలి. అనంతరం వీటన్నిటితో పాటు ఎండు కొబ్బరి కోరు కొంచెం వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఈ పొడిని ఓ బాటిల్ లో భద్రపరచి, కూరలు వండేటప్పుడు కూరంతా అయిన తరువాత చివర్లో ఓ రెండు చెంచాల పొడి చల్లితే కూరకు మంచి రుచి వస్తుంది.

Also Read :

ల్యాప్ టాప్, మొబైల్‌ను పురుషులు ఇలా వాడుతున్నారా… అయితే ముప్పుతప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు

JEE Main Result 2021 released: జేఈఈ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ను డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి..