JEE Main Result 2021 released: జేఈఈ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ను డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి..
JEE Main Result 2021 declared: జేఈఈ 2021 (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021) పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సోమవారం రాత్రి ఎన్టీఏ..
JEE Main Result 2021 declared: జేఈఈ 2021 (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021) పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సోమవారం రాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. దీంతో విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఏ సర్క్యూలర్ ప్రకారం.. అభ్యర్థులందరూ ఆదివారం ఫలితాలను విడుదల చేస్తారని ఊహించారు. కానీ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఏడాది జేఈఈ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగాయి. అభ్యర్థులు ఫలితాలను jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాల కోసం డైరెక్ట్‌గా ఈ లింక్‌ను క్లిక్ చేయండి:
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నాలుగు సార్లు నిర్వహించనున్నారు. తొలి దశ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహించగా తదుపరి దశల ప్రవేశ పరీక్షలు మార్చి, ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి.
ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌కు 6,61,776 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలకు 95 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫైనల్ కీని ఈ నెల 7న ఎన్టీఏ విడుదల చేసింది.
Also Read: