AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Recruitment 2021: పదో తరగతి అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. ఇంకా వారమే గడువు.. వివరాలు..

RBI office attendant recruitment 2021: నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం కష్టపడతున్న యువతకు ఇది సువర్ణావకాశం. రిజర్వ్‌..

RBI Recruitment 2021: పదో తరగతి అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. ఇంకా వారమే గడువు.. వివరాలు..
RBI office attendant recruitment 2021
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2021 | 4:55 PM

Share

RBI office attendant recruitment 2021: నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం కష్టపడతున్న యువతకు ఇది సువర్ణావకాశం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 841 ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2021 పోస్టుల్లో హైదరాబాద్‌ కేంద్రంలో కూడా 57 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 దరఖాస్తులకు చివరితేది. దరఖాస్తు చేయని వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం rbi.org.in వెబ్‌సైట్‌‌లో లాగిన్ అవ్వాలి.

పూర్తి వివరాలు: మొత్తం ఖాళీలు: 841 అర్హత: పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత ఉండాలి. వయసు: ఫిబ్రవరి 1, 2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/జనరల్‌ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15, 2021 పరీక్ష తేదీ: 2021, ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో ఉంటుంది.

ఖాళీల వివరాలు.. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను దేశంలోని వివిధ నగరాల్లో నియమిస్తారు. అహ్మదాబాద్‌లో 50, బెంగళూరులో 28, భోపాల్‌లో 25, చండీగఢ్‌లో 31, చెన్నైలో 71, హైదరాబాద్‌లో 57, జైపూర్ 43, కాన్పూర్‌లో 69, ముంబైలో 202, నాగ్‌పూర్‌లో 55, న్యూ ఢిల్లీలో 50 ఖాళీలు ఉన్నాయి.

Also Read:

Ola Electric Vehicles: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక.. వాహ్ అనక తప్పదు!

Parliament: రేప‌టి నుంచి పూర్తిస్థాయిలో పార్లమెంట్ స‌మావేశాలు.. వేళల్లో మార్పులు..