ఇవాళ జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (జేఈఈ మెయిన్) ఫలితాలు ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉంది.
JEE Main Result 2021 : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (జేఈఈ మెయిన్) ఫలితాలు ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఫైనల్ కీ ని అధికారులు విడుదల చేశారు. మరోవైపు, ఫలితాల విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వం సిద్ధం చేసిందని సమాచారం
గత నెలలో జేఈఈ మెయిన్ 2021 పరీక్ష నిర్వహించడం తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది నాలుగు పర్యాయాలు జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ జనవరి నెలలో ప్రకటించారు. ఇవాళ జేఈఈ మెయిన్ ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2021లో భాగంగా ఫిబ్రవరిలో తొలి పరీక్ష నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలోనూ మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ సైతం సిద్ధం చేశారు. మెయిన్ పర్సంటైల్ స్కో, పర్సంటైల్ ర్యాంక్‌ను స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఆరుగురు విద్యార్థుల మార్కుల ఆధారంగా 100 శాతం పర్సంటైల్ ర్యాంకును ప్రకటిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ ఏడాది నుంచి మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించడంతో పాటు నెగటివ్ మార్కులను సైతం తొలగించారు. మొత్తంగా 11 భాషల్లో విద్యార్థులు పరీక్ష రాసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది.
JEE ప్రధాన తుది జవాబు కీని డౌన్‌లోడ్ చేయండి
JEE (Main) FEB – 2021 FINAL ANSWER KEY
ఇదీ చదవండిః Chhattisgarh: షాకింగ్..!! వింత మరణాలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య..