NTA Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. 1145 ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NTA Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.,,

NTA Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. 1145 ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Follow us

|

Updated on: Mar 08, 2021 | 3:10 AM

NTA Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1145 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు ఫీజు చెల్లించడానికి 2021 మార్చి 17 చివరి తేదీ. దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి 2021 మార్చి 18 నుంచి మార్చి 20 మధ్య అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/ లేదా ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://www.du.ac.in/ చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగ పోస్టులు మొత్తం 1145 పోస్టులు ఉండగా, అందులో జూనియర్ అసిస్టెంట్ – 236, టెలిఫోన్ ఆపరేటర్ – 08, అసిస్టెంట్ – 80, స్టెనోగ్రాఫర్ – 77, యోగా ఆర్గనైజర్ – 01, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 05, నర్స్ – 07, అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్ – 01, జూనియర్ ఇంజనీర్ సివిల్ – 05, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ – 05, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 04, సీనియర్ అసిస్టెంట్ – 45, హిందీ ట్రాన్స్‌లేటర్ – 02, పర్సనల్ అసిస్టెంట్ – 09, ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 16, సోషల్ వర్కర్- 03 పోస్టులున్నాయి.

అలాగే వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్ – 02, ఎక్స్-రే టెక్నీషియన్ – 02, హార్టికల్చరిస్ట్- 01, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్ – 58, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ – 01,స్పోర్ట్ కోచ్ – 01, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 17, ఫార్మసిస్ట్ – 05, టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ – 19, టెక్నికల్ అసిస్టెంట్ హెల్త్ సెంటర్ – 02, స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 2, టెక్నికల్ అసిస్టెంట్ విభాగం – 51, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – 01, తబ్లా సహచరులు – 12, పఖావాజ్ ప్లేయర్ – 01 పోస్టులున్నాయి

అయితే విద్యార్హత వేర్వేరు పోస్టులకు వేర్వేలు అర్హతలున్నాయి. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు వేర్వేరుగా ఉంది. దరఖాస్తు ఫీజు జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ఆన్‌లైన్ టెస్ట్ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో వెల్లడిస్తుంది.

ఇవి చదవండి:

Postal Department: పోస్టల్ స్కీమ్‌లలో కొత్త నిబంధనలు అమలు… నగదు ఉపసంహరణ పెంచుతూ నిర్ణయం

RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు పాటు వైఫై ఉచితం.. ఆ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్‌టెల్‌

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..