AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు పాటు వైఫై ఉచితం.. ఆ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్‌టెల్‌

RailTel Free Wifi: దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ప్రీపెయిడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్నట్లు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్‌ సంస్థ ప్రకటించింది. దేశంలోని మొత్తం...

RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు పాటు వైఫై ఉచితం.. ఆ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్‌టెల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 11:35 PM

RailTel Free Wifi: దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ప్రీపెయిడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్నట్లు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్‌ సంస్థ ప్రకటించింది. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్‌లలో వైఫై సదుపాయం ఉంది. ఇందులో ప్రీపెయిడ్‌ వైఫై సదుపాయం 4వేల స్టేషన్‌లలో లభిస్తుంది. వేర్వేరు స్టేషన్‌లలో స్పీడ్‌ వేర్వేగా ఉంటుంది. 1 ఎంబీపీఎస్‌ నుంచి 34 ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌ లభిస్తుంది. రైల్వే స్టేషన్‌లలో ఎవరైనా ఉచితంగా వైఫైని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొదట 30 నిమిషాలు ఉచితంగా వైఫై ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం వేర్వేరు ప్లాన్స్‌ ప్రకటించింది రైల్‌టెల్‌. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బెస్ట్‌ వెరిఫికేషన్‌ ద్వారా వైఫై అందిస్తోంది. మొదట 30 నిమిషాల పాటు ఉచితమే. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

రైల్‌టెల్ ప్లాన్స్ చూస్తే ఒక రోజులో 5జీబీ డేటా వాడుకోవడానికి రూ.10 చెల్లించాల్సి ఉంటంది. ఒక రోజు 10జీబీ డేటాకు రూ.15, ఐదు రోజులకు 10జీబీ డేటాకు రూ.20, ఐదు రోజులు 20జీబీ డేటాకు రూ.30 చెల్లించాలి. ఇక 10 రోజులకు 20జీబీ డేటా కోసం రూ.40 చెల్లించాలి. 10 రోజులకు 30 జీబీ డేటా కోసం రూ.50 చెల్లించాలి. 30 రోజులకు 60 జీబీ డేటా కోసం రూ.70 చెల్లించాలి. ప్రయాణికులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే సదుపాయం ఉంది. రైల్‌టెల్ లెక్కల ప్రకారం ప్రతీ నెల 3 కోట్ల మంది యూజర్లు రైల్వేస్టేషన్లలో వైఫై ఉపయోగిస్తున్నారు. పెయిడ్ వైఫై సర్వీస్ ద్వారా రైల్‌టెల్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఆదాయం లభిస్తోంది.

ప్రస్తుతం 4 వేల రైల్వే స్టేషన్‌లలో పెయిడ్‌ వైఫై ని రైల్‌టెల్‌ ప్రారంభించింది. ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని 20 రైల్వే స్టేషన్‌లలో ప్రయోగాత్మకంగా పెయిడ్‌ వైఫైని లాంచ్‌ చేసింది. అక్కడీ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ప్రీపెయిడ్‌ వైఫై సర్వీసు ప్రారంభించింది.

ఇవి చదవండి :

Postal Department: పోస్టల్ స్కీమ్‌లలో కొత్త నిబంధనలు అమలు… నగదు ఉపసంహరణ పెంచుతూ నిర్ణయం

Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న కరోపా పాజిటివ్‌ కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న కువైట్‌