Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న కరోపా పాజిటివ్‌ కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న కువైట్‌

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి పైగా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మళ్లీ రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య..

Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న కరోపా పాజిటివ్‌ కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న కువైట్‌
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2021 | 11:09 PM

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి పైగా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మళ్లీ రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కువైట్‌ దేశంలో గణనీయంగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు.. ఇటీవల కువైట్‌ బయటి దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్సిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ విషయమై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. వేరే దేశల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకుని ఉంటారో వారికి ఈ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ అండర్‌ సెక్రటరీ డాక్టర్‌ బోథైనా అల్‌ ముదాఫ్‌ తెలిపారు.

ఇటీవల నమోదవుతున్న ప్రపంచ దేశాల కరోనా నివేదికలను పరిశీలించిన తర్వాత కువైట్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక కువైట్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న 65 ఏళ్లకు పైబడిన పౌరులు, ప్రవాసులు ఎవరైతే వ్యాక్సినేషన్‌ కోసం తమ పేరు నమోదు చేసుకున్నారో వారందరికీ టీకా ఇవ్వడం పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశ జనాభాలో కేవలం 17.4 శాతం మంది మాత్రమే టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నారట. దేశంలోని పౌరులు, నివాసితులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి కాబట్టి త్వరగా టీకా కోసం తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని మంత్రి సూచించారు.

అలాగే భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. . గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చేస్తున్న చర్యలను సమీక్షించారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు. ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గడంతో పాటు వీక్లీ పాజిటివిటీ రేటు పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా సరిగా జరగట్లేదని గుర్తించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ వెల్లడించారు.

Also Read: World corona cases: సెకండ్ వేవ్ వణుకు.. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. తాజా వివరాలు