World corona cases: సెకండ్ వేవ్ వణుకు.. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. తాజా వివరాలు

వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు ఏమాత్రం తొలగిపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 4 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి.

World corona cases: సెకండ్ వేవ్ వణుకు.. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. తాజా వివరాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 07, 2021 | 7:13 PM

వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు ఏమాత్రం తొలగిపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 4 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 11 కోట్ల 71 లక్షల 45 వేల వరకూ రాగా.. 26 లక్షల మందికి పైగా మరణించారు. కొత్తగా జన్యుమార్పులు చోటు చేసుకున్న కొత్త వేరియంట్‌ పలు దేశాల్లో విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ముఖ్యంగా యూరోప్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజుల్లో యూరోప్‌ దేశాల్లో 10 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు అంతకు ముందు వారంతో పోలిస్తే 9 శాతం మేర కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇటలీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. అక్కడ వరుసగా మూడో రోజూ 20వేల దాకా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కొవిడ్ బాధితుల సంఖ్య 30 లక్షలు దాటింది. కరోనా తొలి రోజుల్లో నిర్ధరణ పరీక్షలు జరగనందున కేసుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంచనా. వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 99 వేల 271కు చేరింది. తమ దేశానికి అత్యవసరంగా టీకాలు అందాల్సిన అవసరం ఉందని ఇటలీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇక ఇంగ్లాండ్‌తో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యా తదితర దేశాల్లో సమస్య కొవిడ్‌ కేసులు పెరుగుదల ఎక్కవగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ క్రమంగా పంజుకుంటోంది.

అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే కొవిడ్‌ కేసులు మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 96 లక్షల 54 వేలు దాటింది. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5 లక్షల 37 వేలు దాటేసింది. కాగా గత కొద్ది రోజులుగా అమెరికాలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. నూతన అధ్యక్షుడు జోబైడెన్‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్‌ ప్రజలను ఆదుకునేందుకు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్‌ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడింది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించింది. రిపబ్లికన్ సభ్యులంతా వ్యతిరేకించిప్పటికీ ఈ బిల్లు 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చేవారం కాంగ్రెస్​ ఆమోదం కోసం పంపిస్తారు. కరోనా వల్ల అమెరికా చాలా కాలం నష్టపోయిందని, అందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా పౌరులకు ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు చేయడం సహా కొవిడ్‌పై పోరాటానికి నిధులను వెచ్చిస్తారు.

Also Read:

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?