Breaking News: షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది.  రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో రోడ్డు పక్కన ఏర్పాటు

Breaking News:  షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Follow us

|

Updated on: Mar 07, 2021 | 12:56 PM

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది.  రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ అభిమానులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

వెఎస్ షర్మిల త్వరలో పార్టీ ఏర్పాటు చేయబోతున్న క్రమంలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆమెకు లభిస్తున్న ప్రజాధారణను తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. షర్మిల ఫాలోవర్స్ చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో షర్మిల బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ధ్వంసమైన విగ్రహాం 2013లో షర్మిల ఆవిష్కరించిందే అవ్వడం గమనార్హం. ఆ విగ్రహ శిలాఫలకంపై అప్పడు  వైసీపీలో ఉన్న నాయకులు పువ్వాడ అజయ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి.  విగ్రహ ధ్వంసంపై స్థానిక వైఎస్‌ఆర్ అభిమాని పిట్టా రామ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం సభను అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని… శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఈ ఘటనలకు పాల్పడుతున్నారో తమకు తెలుసని.. షర్మిలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే  పట్టుకుని… కఠిన చర్యలు తీసుకోవాలని రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూల్చివేసిన చోటే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు శివాయిగుడెం చేరుకుంటారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.  ఏప్రిల్ 9 న సభ పెట్టి తీరుతామని.. విజయవంతం చేస్తామని చెప్పారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే వైఎస్ అభిమానులుగా తాటతీస్తామంటూ కాస్త ఘాటుగానే స్పందించారు రామ్ రెడ్డి .

కాగా వైఎస్‌ఆర్ విగ్రహ ధ్వంసంపై షర్మిల కూడా స్పందించారు. తెలంగాణలో రాజన్న పాలన మళ్లీ రావాలని, ప్రజల్లో పెరుగుతోన్న బలాన్ని,  రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్ అభిమానులంతా సంయమనం పాటించాలని ఆమె విజ్ఙప్తి చేశారు.

Also Read:

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 158.. దేశంలో కూడా ప్రమాదకరంగా కేసులు

గుబ్బల మంగమ్మను దర్శించేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.. మధ్యలో టీ తాగేందుకు ఆగారు.. ఇంతలో

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!