Jangareddygudem Accident: గుబ్బల మంగమ్మను దర్శించేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.. మధ్యలో టీ తాగేందుకు ఆగారు.. ఇంతలో

  పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. జంగారెడ్డిగూడెం బైపాస్‌లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద...

Jangareddygudem Accident: గుబ్బల మంగమ్మను దర్శించేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.. మధ్యలో టీ తాగేందుకు ఆగారు.. ఇంతలో
Jangaareddygudem road accident..
Follow us

|

Updated on: Mar 07, 2021 | 11:57 AM

Jangareddygudem Accident:  పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. జంగారెడ్డిగూడెం బైపాస్‌లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. బుట్టాయి గూడెంలోని గుబ్బల మంగమ్మ ఆలయానికి ట్రాక్టర్‌లో భక్తులు బయలుదేరారు. మధ్యలో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద టీ తాగేందుకు ఒక దుకాణం వద్ద ట్రాక్టర్‌ను ఆపారు. అదే సమయంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ తిరగబడింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌లోని 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందినవారుగా తెలుస్తుంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డవారిని 108 వాహనాలలో ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. మిగితావారు జంగారెడ్డి గూడెం ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏలూరు ఆస్పత్రికి తరలించినవారిలో ఇద్దరి పరిస్థితి విషమించినట్టు సమాచారం. ఆస్పత్రిలో ప్రమాద బాధితులను పోలీస్ అధికారులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు విషయం చేరవేశారు.  వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధితులకు సరైన వైద్యం అందజేయాలని వైద్యులకు పోలీసులు సూచించారు.

Also Read:

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 158.. దేశంలో కూడా ప్రమాదకరంగా కేసులు

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు