AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

ఆరోగ్యకరమైన మేత వేసి చేపలను పెంచాలి. కానీ కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన చేపలు విషతుల్యమే. ఇవి తింటే ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతాయి.

Telangana: తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 08, 2021 | 1:22 PM

Share

ఆరోగ్యకరమైన మేత వేసి చేపలను పెంచాలి. కానీ కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన చేపలు విషతుల్యమే. ఇవి తింటే ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతాయి. సంపాదనే లక్ష్యంగా చేపలు పెంచుతున్నవారికి ఇవేవి పట్టవు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు…విష పూరితంగా మారిన చేపలను విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు..

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామ సమీపాన చికెన్ లో వుండే వ్యర్థ పదార్థాలను సేకరించి పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దాణాగా అందిస్తున్నారు. పక్కనే గోదావరి ఉండడంతో వీటిని ‘గంగ చేపలుగా చెప్పి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. కానీ చికెన్ వేస్టేజ్ తో పెంచిన ఈ చేపలు తింటే మాత్రం రోగాలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా భీమరాం పరిసర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా చేపలు పెంచుతున్నారు. ఆంధ్రాకు చెందిన కొంతమంది ఇక్కడి రైతుల దగ్గర వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని చేపల చెరువులు చేశారు. జెల్ల రకానికి చెందిన చేపలను ఎక్కువగా పెంచుతున్నారు. చేపలకు ఆరోగ్యకరమైన జొన్న మొక్కజొన్నతో పాటు పలు రకాలపిండిని మేతగా వేస్తారు. కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలనే అత్యాశతో చికెన్ వేస్టేజ్ వేసి చేపలను పెంచుతున్నారు. మంచిర్యాల, గోదావరిఖనిలోని చికెన్ సెంటర్ల నుంచి చికెన్ వేస్టేజ్ పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు

ఈ చేపలను మంచిర్యాల, గోదావరిఖనికి మార్కెట్లో, గ్రామాల్లో జరిగే వారసంతలో ‘గంగ చేపలు’గా చెప్పి అమ్ముతున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా…పట్టించుకునే నాధుడే కరువయ్యారు.. చికెన్ వేస్టేజ్ పశువుల వ్యర్థాలను మేతగా వేస్తున్న సంఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అధికారుల దాడులతో కొంతకాలం మానేసినప్పటికీ తిరిగి పాత పద్ధతిలోనే నడుస్తున్నారు.సంబంధిత అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చేపల అక్రమ పెంపకందార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..

Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి… ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ

Follow Us
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
ఒంటరిగా ప్రయాణించాలా?సోలో ట్రావెలింగ్ కోసం టాప్ 5 బెస్ట్ ప్లేసెస్
ఒంటరిగా ప్రయాణించాలా?సోలో ట్రావెలింగ్ కోసం టాప్ 5 బెస్ట్ ప్లేసెస్