AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్-2021 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. చోటు దక్కించుకోలేక పోయిన హైదరాబాద్.. ఎందుకో తెలుసా..?

Hyderabad Has No Place: ఐపీఎల్-14 మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు ఓకే అయ్యాయి. అయితే.. హైదరాబాద్‌కు మాత్రం మొడ్డి చెయ్యి లభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఏకంగా ఓ టీమ్‌ ఉన్నప్పటికీ…

ఐపీఎల్-2021 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. చోటు దక్కించుకోలేక పోయిన హైదరాబాద్.. ఎందుకో తెలుసా..?
uppal stadium ipl
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2021 | 4:00 PM

Share

ఐపీఎల్-14 మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు ఓకే అయ్యాయి. అయితే.. హైదరాబాద్‌కు మాత్రం మొడ్డి చెయ్యి లభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఏకంగా ఓ టీమ్‌ ఉన్నప్పటికీ… ఇక్కడ ఒక్క మ్యాచ్‌ కూడా నిర్వహించడం లేదు. అన్ని మ్యాచ్‌లు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీల్లో నిర్వహించబోతున్నారు.

ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్‌ 9న చెన్నైలో తొలి మ్యాచ్‌ ఉంటుంది. ముంబై-బెంగళూరు టీమ్‌లు తలపడతాయి. అయితే.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరపకూడదని ఏరకంగా నిర్ణయం తీసుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా కొనసాగుతోంది.

కోవిడ్ కేసులను ప్రాతిపదికగా తీసుకుని ఉంటే.. హైదరాబాద్‌లో పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మంత్రి KTR సైతం.. మెరుగైన వసతులు కల్పిస్తాం.. మా దగ్గర మ్యాచ్‌లు నిర్వహించడని ప్రత్యేకంగా ఆహ్వానం కూడా పంపించారు. అయినా.. IPL నిర్వాహకులు ఎందుకో లైట్‌ తీసుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు రికార్డవుతున్నా.. మ్యాచ్‌ల నిర్వహణలో ముంబైకి పెద్దపీట వేశారు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లో స్థానిక ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వలేదని అభిప్రాయం మాత్రం హైదరాబాదీల్లో ఉంది. మ్యాచ్‌లను అడ్డుకుంటామని మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హెచ్చరించారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే హైదరాబాద్‌కు ప్లేస్‌ కల్పించలేదా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. దానం ఇష్యూ తర్వాతే మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా.. IPL నిర్వాహకులు హైదరాబాద్‌ను తప్పించారు.

ఇవి కూడా చదవండి..

IPL 2021 schedule: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.. ఏప్రిల్ 9 నుంచి క్రికెట్ పండుగే… షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ..

Boxam International: కోవిడ్ రక్కసి వెంటాడింది… స్వర్ణం పోయింది… ఫైనల్స్​ నుంచి ముగ్గురు భారత బాక్సర్ల ఔట్