ODI Cricket: వన్డే చరిత్రలోనే అద్భుతం.. 43 ఫోర్లు, 14 సిక్స్‌లు.. గ్రౌండ్‌ను దడదడలాడించిన బ్యాట్స్‌మెన్..

ODI Cricket: చరిత్రలో కొన్ని రోజులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వాటిని ఎప్పటికీ మరువలేము. మరికొన్ని రోజులు..

ODI Cricket: వన్డే చరిత్రలోనే అద్భుతం.. 43 ఫోర్లు, 14 సిక్స్‌లు.. గ్రౌండ్‌ను దడదడలాడించిన బ్యాట్స్‌మెన్..
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: Mar 08, 2021 | 11:28 AM

ODI Cricket: చరిత్రలో కొన్ని రోజులకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వాటిని ఎప్పటికీ మరువలేము. మరికొన్ని రోజులు చరిత్ర‌కు ఆనవాళ్లుగా నిలుస్తాయి. అలాంటి రోజుల్లో మార్చి 7వ తేదీ కూడా ఒకటి అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ రోజు అద్భుత ఘట్టానికి కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. 1996 మార్చి 6వ తేదీన 14 సిక్స్‌లు, 43 ఫోర్లతో క్రికెట్ గ్రౌండ్ దడదడలాడింది. కెన్యా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ దీనికి వేదికగా నిలిచింది.

పూర్తివివరాలు పరిశీలిస్తే.. 1996 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా కెన్యా, శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని రీతిలో భారీ స్కోర్ నమోదైంది. అంతేకాదు.. అత్యధిక ఫోర్లు, సిక్సర్లు నమోదు అయ్యాయి. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ భారీ స్కోర్‌ను బీట్ చేయడానికి చాలా సంవత్సరాలే పట్టింది.

మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కెన్యా కెప్టెన్ మారిస్ ఒడుంబే మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్‌కు దిగింది. సనత్ జయసూర్య, రోమేష్ కలువిదర్ణ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని అందించారు. రోమేష్ 18 బంతుల్లో 33 పరుగులు చేయగా.. జయసూర్య 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన అసంకా గురుసిన్హా, అరవింద డెసిల్వా క్రీజ్‌ను షేక్ చేశారు. వారు ఆడినంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించారు. బంతిని గ్రౌండ్ నలువైపులా బౌండరీని దాటించి జట్టు స్కోర్‌ను ఊహించని రీతిలో పెంచేశారు. గురుసిన్హా 103 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. డెసిల్వా 115 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులు చేశాడు. ఇక రణతుంగ కూడా అంతే స్థాయిలో వీరవిహారం చేశాడు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులు చేసి కెన్యా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 5 వికెట్ల నష్టానికి శ్రీలంక జట్టు 398 పరుగులు చేసింది.

144 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక.. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెన్యా జట్టు శ్రీలంక బౌలర్ల ముందు నిలవలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా శ్రీలంక జట్టు కెన్యాపై 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, కెన్యా బ్యాట్స్‌మెన్ స్టీవ్ టికోలో జట్టు విజయం కోసం చాలా శ్రమించాడు. 95 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. స్టీవ్ ఔట్ అవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కెన్యా జట్టులో అతని తరువాత అత్యధిక స్కోర్ చేసిందంటే హితేష్ మోడీనే. 82 బంతులాడిన హితేష్ 41 పరుగులు చేశాడు. ఆ తరువాత దీపక్ చుడాసామా 27, డేవిడ్ టికోలో 25, లమేక్ ఒన్యాంగో 23 పరుగులు అందించారు.

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌‌లో మొత్తం 14 సిక్సర్లు, 43 ఫోర్లు నమోదు అయ్యాయి. ఇదే ఈ మ్యాచ్‌కు స్పెషల్ హైలెట్.

Also read: IPL 2021 Schedule: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.. ఏప్రిల్ 9 నుంచి క్రికెట్ పండుగే… షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ..

Scary Video: కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!