Boxam International: కోవిడ్ రక్కసి వెంటాడింది… స్వర్ణం పోయింది… ఫైనల్స్​ నుంచి ముగ్గురు భారత బాక్సర్ల ఔట్

Indian Boxers: కరోనా రక్కసి ఆటగాళ్లను కూడా వెంటాడుతోంది. బక్సమ్​ టోర్నీ ఫైనల్స్​కు ముందు.. భారత బాక్సర్​ ఆశీష్​ కుమార్​కు కరోనా అనుమానాలు..

Boxam International: కోవిడ్ రక్కసి వెంటాడింది... స్వర్ణం పోయింది...  ఫైనల్స్​ నుంచి ముగ్గురు భారత బాక్సర్ల ఔట్
COVID-19 case hits Indian boxers in Spanish tourney
Follow us

|

Updated on: Mar 07, 2021 | 1:37 PM

Indian Boxersl: కరోనా రక్కసి ఆటగాళ్లను కూడా వెంటాడుతోంది. బక్సమ్​ టోర్నీ ఫైనల్స్​కు ముందు.. భారత బాక్సర్​ ఆశీష్​ కుమార్​కు కరోనా అనుమానాలు పక్కకు తప్పించాయి. దీంతో అతని సహచరులు హుసాముద్దీన్​, సుమిత్​ సంగ్వాన్​లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారు.

స్పెయిన్ వేదికగా జరుగుతోన్న బక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నమెంట్​ ఫైనల్​ పోరుకు ముందు.. భారత్​కు ఊహించని షాక్​ తగిలింది. కరోనా కారణంగా టోర్నీ నుంచి ముగ్గురు బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. 75 కేజీల విభాగంలో భారత్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశీష్​ కుమార్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. దీంతో అతని రూమ్​మేట్​లు అయిన మహమ్మద్​ హుసాముద్దీన్​ (57 కేజీ), సుమిత్ సంగ్వాన్ (81 కేజీ) కూడా పోటీ  వైదొలగాల్సి వచ్చింది.

ఈ ముగ్గురికి రజత పతకాలు….

స్వర్ణం గెలుచుకోవల్సిన ఆటగాళ్లకు పెద్ద ఎదురుదెబ్బతగిలింది. ఫైనల్లో పోటీ పడితే వారికి స్వర్ణం గెలిచే వచ్చి వుండేది. హుసాముద్దీన్​, సంగ్వాన్​లకు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్​గా వచ్చినప్పటికీ.. స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టోర్నీ నుంచి తప్పుకోక తప్పలేదు.

మరోవైపు అనారోగ్యం కారణంగా మరో వెటరన్​ బాక్సర్ సతీశ్​ కుమార్ 91 పైన కేజీల విభాగం కూడా ఫైనల్లో పాల్గొనలేదు. ఇతనికీ రజత పతకం దక్కనుంది. ​ఎంతో గొప్పగా ప్రారంభించిన బాక్సింగ్ పోటీలు.. చివరికిలా ముగించింది భారత్. ఆశీష్​కు ఎలాంటి వైరస్​ లక్షణాలు లేవు.. కానీ.. అతడు బాగానే ఉన్నాడని భారత బాక్సింగ్ హై పర్ఫామెన్స్​ డైరెక్టర్ శాంటిగో నీవా పేర్కొన్నారు.

ఒక్కరే ‘బంగారం’..

ఇందిలావుంటే.. పురుషుల 63 కేజీ విభాగంలో కేవలం మనీశ్​ కుమార్​ మాత్రమే స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో డెన్మార్క్​ ప్రత్యర్థి నికోలై టెర్టెర్యాన్​పై మనీశ్​ గెలుపొందాడు. మోకాలి గాయం తగ్గడంతో తర్వాత ఆడిన తొలి టోర్నమెంట్​లోనే మనీశ్​ సత్తా చాటాడు. 69 కేజీల విభాగంలో వికాస్​ క్రిష్ణన్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పైగా ఈ పోటీలో అతనికి కంటికి గాయమైంది.

ఇవి కూడా చదవండి

తక్కువ ధరలకే మందులు దొరికే ‘మోదీ కీ దుకాన్’, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, మోదీ

Richards Birthday Special: విధ్వంసకరమైన ఆటకు తొలి ప్రతీక వివియన్‌ రిచర్డ్స్‌, రిచర్డ్స్‌ అంటేనే ఊచకోత..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..