Richards Birthday Special: విధ్వంసకరమైన ఆటకు తొలి ప్రతీక వివియన్‌ రిచర్డ్స్‌, రిచర్డ్స్‌ అంటేనే ఊచకోత..

అతడు మైదానంలోకి కాలుపెట్టాడంటే చాలు 22 గజాల పిచ్‌ కూడా గజగజలాడిపోయేది. బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి! విధ్వంసం ఎలా ఉంటుందో అతడి బ్యాటింగ్‌ చూస్తే...

Richards Birthday Special: విధ్వంసకరమైన ఆటకు తొలి ప్రతీక వివియన్‌ రిచర్డ్స్‌, రిచర్డ్స్‌ అంటేనే ఊచకోత..
Sir Vivian Richards Birthday Special
Follow us
Balu

| Edited By: Sanjay Kasula

Updated on: Mar 07, 2021 | 1:10 PM

Sir Vivian Richards Birthday Special: అతడు మైదానంలోకి కాలుపెట్టాడంటే చాలు 22 గజాల పిచ్‌ కూడా గజగజలాడిపోయేది. బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి! విధ్వంసం ఎలా ఉంటుందో అతడి బ్యాటింగ్‌ చూస్తే తెలుస్తుంది. ఊచకోత అంటే ఏమిటో అతడికి బౌలింగ్‌ చేసిన బౌలర్లను అడగండి చెబుతారు.

అతడు ఓ మర ఫిరంగి.. ఓ శతఘ్ని.. ఓ మత్తేభం! ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల క్షిపణి.. ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఇన్నేసి విశేషణాలకు సరిపోయే ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్‌ ఉన్నాడు. అతడే సర్‌ ఇసాక్‌ వివియన్‌ అలెగ్జాండర్‌ రిచర్డ్స్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ అంటే రిచర్డ్స్‌ ఒక్కడే.. క్రికెట్ ఉన్నంత కాలం ఒక్కడే ఉంటాడు కూడా! మరొకరికి అది అంతగా నప్పదు. ఒకవేళ అభిమానం కొద్దీ అన్నా అది పౌండ్రక వాసుదేవుడిని కృష్ణుడన్నట్టుగా ఉంటుంది.. ఇవాళ రిచర్డ్స్‌ బర్త్‌డే! ఈ సందర్భంగా అతడి గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకుందాం! రిచర్డ్స్‌ ఆటను.. ఆడే శైలిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. ఎందుకంటే అతడో ప్రత్యేకం! విభిన్నం.!

ఇవాళ 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్న వివియన్‌ రిచర్డ్స్‌ 1952, మార్చి ఏడున అంటిగ్వాలోని సెయింట్‌ జాన్స్‌లో జన్మించాడు. 1974లో భారత్‌తో జరిగిన సిరీస్‌తో రిచర్డ్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభమయ్యింది.. బెంగళూరులో జరిగిన మొదటి టెస్ట్‌లో రిచర్డ్స్‌ ఎవరన్నది చాలా మందికి తెలియకపోయినా ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో రిచర్డ్స్‌ అజేయంగా చేసిన 192 పరుగులు అందరి దృష్టి రిచర్డ్స్‌పై పడేలా చేసింది. బౌలర్‌ ఎవరన్నది రిచర్డ్స్‌కు అనవసరం! అతడు పేసరా? స్పిన్నరా అన్నది కూడా అనవసరం..

బంతి పడటమే ఆలస్యం అది బౌండరీకి చేరాలన్నదే రిచర్డ్స్‌ ఫిలాసఫీ. ఆనాటి బౌలర్లందరూ రిచర్డ్స్‌కు బలైనవారే! బాబ్‌ విల్లిస్‌, డెన్నిస్‌ లిల్లీలు అయితే ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపారు.. 1986లో అంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో కేవలం 56 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. 1976లో 90.00 సగటుతో 1710 పరుగులు చేశాడు.. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి.. అలాగే ఒకే వన్డేలో సెంచరీ , అయిదు వికెట్లు తీసుకున్న ఏకైక ఆటగాడు రిచర్డ్స్‌ మాత్రమే!

రిచర్డ్స్‌ నడుచుకుంటూ వస్తుంటే.. వేటకు బయలుదేరిన సింహలా కనిపిస్తాడు.. చూయింగ్‌గమ్ నములుతూ అతడు గార్డ్స్‌ తీసుకుంటుంటున్నప్పుడే ప్రత్యర్థి జట్టుకు తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తాయి.. ఫార్మాట్‌ ఎలాంటిదైనా బంతి మాత్రం రిచర్డ్స్‌ బ్యాట్‌కు తలొగ్గాల్సిందే! మొత్తం 121 టెస్ట్‌ మ్యాచులు ఆడిన రిచర్డ్స్‌ 50.20 సగటుతో 8,540 రన్స్‌ చేశాడు. 187 వన్డేలలో 47.00 సగటుతో 6,721 పరుగులు చేశాడు.. ఈ గణాంకాలతో రిచర్డ్స్‌ను బేరీజు వేయకూడదు..

ఎందుకంటే రిచర్డ్స్‌ రికార్డుల కోసమో, స్టాటిస్టిక్స్‌ కోసమో ఆడలేదు.. తన దేశం కోసమే ఆడాడు.. రిచర్డ్స్‌ ఫుట్‌వర్క్‌ అద్భుతం.. అతడి ఐ ఐసైట్‌ కూడా అద్భుతమే.. ఈ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టే రిచర్డ్స్‌ ఏనాడూ హెల్మెట్‌ పెట్టుకోలేదు.. హెల్మెట్‌ ఏమిటీ అసలు ఏ రకమైన ఆర్మ్‌గార్డ్‌లు కూడా వాడడు.. ఎలాంటి పిచ్‌పైనా.. ఎలాంటి వాతావరణంలోనైనా రిచర్డ్స్‌ ఆటగలడు..

రిచర్డ్ హ్యాడ్లీ, డెన్నిస్‌ లిల్లీ, అబ్దుల్‌ ఖాదిర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, ఇయాన్‌ బోథం, కపిల్‌దేవ్‌ వంటి అతిరథుల బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, క్రిస్‌ గేల్‌, డివిలియర్స్‌ ఆట చూసి అబ్బురపడుతున్న ఇప్పటి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారి రిచర్డ్స్‌ ఆట చూస్తే బాదుడంటే ఇలా ఉంటుందా అని తెలుసుకోగలుగుతారు. రిచర్డ్స్‌ క్రౌడ్‌పుల్లర్‌.. అతడు ఆడుతుంటే స్టేడియంలు హోరెత్తిపోతాయి.. అలాంటి విధ్వంసకరమైన ఆటగాడు మళ్లీ రాడు.. హప్పీ బర్త్‌డే టు రిచర్డ్స్‌..

ఇవి కూడా చదవండి..

Aaron Finch: వంద సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా సరికొత్త రికార్డు.. అయితే ఆ తర్వాత స్థానంలో…!

Rohit shares pic: ‘అతను మెంటల్ కాదా?’.. రిషబ్ పంత్‌పై రోహిత్ శర్మ కామెంట్..!

Ashwin Breaks Records : రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. దిగ్గజాల సరసన చోటు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!