AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit shares pic: ‘అతను మెంటల్ కాదా?’.. రిషబ్ పంత్‌పై రోహిత్ శర్మ కామెంట్..!

Rohit shares pic: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో అందరికీ తెలిసిందే.

Rohit shares pic: 'అతను మెంటల్ కాదా?'.. రిషబ్ పంత్‌పై రోహిత్ శర్మ కామెంట్..!
Shiva Prajapati
|

Updated on: Mar 06, 2021 | 9:51 PM

Share

Rohit shares pic: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు గ్రౌండ్‌లో పడుకుని ఆలోచిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అతని భార్య రితికా ట్రోల్ చేసింది. తాజాగా రిషబ్‌ పంత్‌తో సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. పంత్‌పై సరదాగా కామెంట్స్ చేశాడు. ‘ఇతనికి మెంటల్ కదా? స్పైడర్‌లా అద్భుతంగా ఆడేశాడు’ అని క్యాప్షన్ పెట్టాడు. కాగా, నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. 118 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ.. అతని బ్యాటింగ్ శైలిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. రోహిత్ చేసిన పోస్ట్‌కు అభిమానులు స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా వీరిద్దరి ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. Rohit Sharma Insta Post:

Also read:

మయన్మార్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. సైన్యాన్ని అడ్డుకునేందుకు మహిళల వినూత్న ప్రయోగం..!

New Covid-19 : మళ్లీ కరోనా కాటు, అప్రమత్తంగా ఉండాలంటూ 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక