Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Covid-19 : మళ్లీ కరోనా కాటు, అప్రమత్తంగా ఉండాలంటూ 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక

New Covid-19 : భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ హడలెత్తిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. . గత కొన్ని వారాలుగా..

New Covid-19 : మళ్లీ కరోనా కాటు,  అప్రమత్తంగా ఉండాలంటూ 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 06, 2021 | 9:35 PM

New Covid-19 : భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ హడలెత్తిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. . గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చేస్తున్న చర్యలను సమీక్షించారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు. ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గడంతో పాటు వీక్లీ పాజిటివిటీ రేటు పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా సరిగా జరగట్లేదని గుర్తించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ వెల్లడించారు.

దేశంలో కరోనా పరిస్థితి కంగారు పుట్టిస్తున్న తరుణంలో కొవిడ్‌ మొదటి దశలో తీసుకున్న చర్యలను మళ్లీ తిరిగి అమలు చెయ్యాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని ట్రేస్‌ చేయడంతో పాటు వారికి చికిత్స అందించాలన్నారు. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలని సూచించింది. ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ జరగాలన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలకు కేంద్రం శనివారం ఉన్నత స్థాయి ఆరోగ్య బృందాలను పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బృందాలు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, కట్టడి చర్యలపై పని చేస్తాయని వెల్లడించారు. శనివారం నాటికి మహారాష్ట్రలో 90,055 క్రియాశీల కేసులుండగా, పంజాబ్‌లో 6,661 కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Read also : Fake HRC : అమీన్ పూర్ స్థలాలపై కన్ను, పైకి పెద్ద ఆఫీసర్‌లా బిల్డప్, హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్