Fake HRC : అమీన్ పూర్ స్థలాలపై కన్ను, పైకి పెద్ద ఆఫీసర్‌లా బిల్డప్, హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్

Fake HRC : హ్యూమన్ రైట్స్ ముసుగులో బెదిరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా..

Fake HRC : అమీన్ పూర్ స్థలాలపై కన్ను, పైకి పెద్ద ఆఫీసర్‌లా బిల్డప్,  హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్
Follow us

|

Updated on: Mar 06, 2021 | 9:21 PM

Fake HRC : హ్యూమన్ రైట్స్ ముసుగులో బెదిరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజ్‌కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. HRCPC చైర్మన్‌గా చలామణి అవుతూ పఠాన్ చెరు, శేరిలింగంపల్లి, సంగారెడ్డి ప్రాంతాల్లో స్థలాలపై NGTలో కేసులు వేశాడు రాజ్ కుమార్ సింగ్. అమీన్‌పూర్‌లో ప్రైవేట్ స్థలాల్లో డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి ప్రభుత్వ భూమి అంటూ రాజ్ కుమార్ సింగ్ బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ముగ్గురి స్థలాల్లో డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తుండగా గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అడ్వకేట్‌లతో నోటీసులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.

గ్రామస్తుల నుంచి లక్షల్లో డబ్బు డిమాండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీగా వచ్చిన అమీన్‌పూర్ లింగమయ్య కాలనీ, మంజీరానగర్ వాసులు వచ్చి పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి ఉంటున్న వారిని ట్రస్టు ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్న రాజ్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు 447, 506 r/w ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read also : Meghan Markle : రాకుమారి మేఘన్‌ మార్కెల్‌ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వూకి రెండే రోజులు, బ్రిటన్‌ రాణి కోటలో కలవరం